న్యూ ఇయర్: మోత్కుపల్లికి గవర్నర్ గిరీ ఛాన్స్!
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి వరించే అవకాశాలున్నాయని సమాచారం. ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
అయితే, ఏడాదికాలంగా ఈ అంశం నలుగుతూనే ఉంది. కొత్త ఏడాదిలో ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని తెలుస్తోంది. దక్షిణాదికి చెందిన ఏదో ఒక రాష్ట్రానికి ఆయన్ను గవర్నర్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.

జనవరిలో ఈ మేరకు కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఈ సమచారంతో మోత్కుపల్లి వర్గీయులతోపాటు తెలుగుదేశం పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications