ముద్రగడ దీక్ష: చంద్రబాబు చెవిలో చెప్పిందేమిటి?

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారంనాడు కడపలో తన మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా ముగించడంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది కూడా... సెక్యూరిటీ అధికారి ఆయన చెవిలో ఏదో చెప్పగానే, ఆయన రెండు మూడు మాటలు చెప్పి లేచి నిలబడి మీడియా సమమావేశాన్ని ముగించారు.

ఈ రోజుల్లో చంద్రబాబు మీడియా సమావేశం అంటే రెండు గంటలూ మూడు గంటలూ సాగుతోంది. కానీ కడపలో గురువారం ఉదయం మీడియా సమావేశం అలా జరగలేదు. మధ్యలో సీఎం సెక్యూరిటీ అధికారి వేగంగా అక్కడకు వచ్చి చంద్రబాబు చెవిలో ఏదో చెప్పారు. వెంటనే ఆయన ప్రెస్‌మీట్‌ ముగించి వెళ్లారు.

 Chandrababu ends PC following the information from officer

ముద్రగడ పద్మనాభం దీక్ష పరిణామాల గురించి సెక్యూరిటీ అధికారి చెప్పారని, ఆయన్ను అరెస్టు చేసే అంశంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎంతో చర్చించాల్సి ఉండడంతో సెక్యూరిటీ అధికారి ఈ విషయాన్ని సీఎం చెవిలో వేశాడని, అందుకే వెంటనే ప్రెస్‌మీట్‌ నుంచి వెళ్లిపోయారని అంటున్నారు.

ఆయన హుటాహుటిన విజయవాడకు బయలుదేరి వెళ్లి హోం మంత్రి చినరాజప్పతో గన్నవరం విమానాశ్రయంలోనే సమావేశమయ్యారు. ఆ తర్వా ముద్రగడ పద్మనాభం అరెస్టుకు రంగం సిద్ధమైంది. అయితే ముఖ్యమంత్రి బ్యాంకర్ల సభలో పాల్గొనాల్సి ఉందని సమయం అయినందున ఆ విషయాన్ని సీఎంకు సెక్యూరిటీ గుర్తు చేశారని కూడా అంటున్నారు. ఏమైనా, ముద్రగడ పద్మనాభం దీక్షకే చంద్రబాబు ప్రవర్తనకు అంటగడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+