ప్రాణం తీసిన మేక గొడవ, తుపాకీతో కాల్చుకున్నారు

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మేక కోసం జరిగిన ఘర్షణలో 24 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మేక తమ ఇంట్లోకి వచ్చిందని పక్కింటి వారితో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఘర్షణలో అతను మృతి చెందాడు.

ఆదివారం సాలేనగర్‌ గ్రామంలో సమయుద్దీన్‌ పెంచుకునే మేక పొరుగున ఉన్న జావేద్‌ ఇంటిలోకి ప్రవేశించింది. దీంతో జావేద్‌ కుటుంబ సభ్యులు కేకలు వేశారు. తమ ఇంటిలోకి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జావెద్, సమయుద్దీన్ కుటుంబాల మధ్య మాటామాటా పెరిగింది.

Man shot dead in a brawl over goat

కర్రలతో పోట్లాడుకున్నారు. చివరకు తుపాకీతో కాల్చుకునే వరకు వెళ్లారు. ఈ ఘటనలో జావెద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘర్షణలో జావెద్ సోదరికి, మరో బంధువుకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+