రంజితను పక్కన పెట్టేసి నిత్యానంద ఇలా: ఎందుకు?
తిరుపతి: వివాదాలకు ఆలవాలంగా మారిన స్వామి నిత్యానంద ఒక్కసారిగా కొత్త గెటప్‌తో తిరుమలలో దర్శనమిచ్చాడు. ఎక్కడికి వెళ్లినా తన అనుంగు శిష్యురాలైన రంజితను పక్కనే ఉంచుకుని వెళ్లే నిత్యానంద శుక్రవారం మాత్రం తిరుమల వెంకన్న దర్శనం కోసం ఆమెను పక్కన పెట్టి తన అనుచరగణంతో విచ్చేశాడు.
నిత్యానంద దర్శించుకుని వెళ్లిన తర్వాత రంజిత శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం. ఇంతకు ముందు 2014లో శ్రీవారి దర్శనానికి నిత్యానంద, రంజిత కలిసి వచ్చారు. అయితే తాజాగా నేడు ఇద్దరూ విడివిడిగా వెంకన్నను దర్శించుకోవడంపై చర్చనీయాంశంగా మారింది.

అంతకు ముందు రోజే రంజిత, నిత్యానంద కలిసే శ్రీకాళహస్తి వచ్చారు. ఈ సందర్భంగా నిత్యానంద అనుచరులు చేసిన హంగామా వివాదాస్పదమైంది. నిత్యానంద, రంజితలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని వారు అడ్డుకున్నారు. ఫొటోగ్రాఫర్లతో వారు దురుసుగా ప్రవర్తించి తోసేశారు. మీడియాతో మాట్లాడకుండానే నిత్యానంద, రంజిత అక్కడ్నుంచి తిరుగుపయనమయ్యారు.
నిత్యానంద, రంజిత మళ్లీ తెర మీదికి వచ్చిన నేపథ్యంలో ఆశ్రమంలో జంపింగ్ యోగా పేరుతో వారు చేసిన, చేయించిన విచిత్ర విన్యాసాలు నెట్‌లో సందడి చేస్తున్నాయి. ఆశ్రమానికి వచ్చిన భక్తుల చేత యోగా పేరుతో కూర్చున్న చోటు నుంచి పైకి ఎగరడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం వంటివి చేయిస్తుంటారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications