వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మృతి ఇరానీని 'డియర్' అన్న బీహార్ మంత్రి, ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీహార్ విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి కేంద్రమంత్రి స్మృతి ఇరానీనీ 'డియర్' అని సంభోదించారు. దీనిపై ట్విట్టర్లో రగడకు దారి తీసింది. స్వయంగా స్మృతి ఇరానీ ఆయనకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇరువురి మధ్య ట్వీట్ల ఘర్షణ చోటు చేసుకుంది.

'డియర్‌ స్మృతీ ఇరానీజీ! కొత్త విద్యా విధానం ఎప్పుడు వస్తుంది? మీ క్యాలెండర్‌లో 2015 ఎప్పుడు ముగుస్తుంది?' అని బీహార్ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అశోక్‌ చౌదరి ట్వీట్‌ చేశారు.

దీనికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిస్తూ 'మహిళలను డియర్ అంటూ సంబోధించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు, అశోక్ చౌదరీజీ?' అంటూ ఎదురు ప్రశ్నించారు.

Oh Dear, Smriti Irani And Bihar's Education Minister Spar On Twitter

స్మృతి ఇరానీ ట్వీట్ పైన అశోక్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావంతులు, ప్రొఫెషనల్‌ మెయిల్స్‌ 'డియర్'తో ప్రారంభమవుతాయని, ఇది అవమానపరచడానికి కాదని, విషయం తెలియజేయడం కోసం చెబుతున్నానని ప్రతిస్పందించారు.

దానికి స్మృతి ఇరానీ స్పందిస్తూ... తాను 'ఆదరణీయ' అంటూ సంభాషణ ప్రారంభిస్తానని సమాధానమిచ్చారు. దీనిపై అశోక్ చౌదరి 'లేని వాటిని వివాదం చేయడం మానుకొని, ఆరోపణకు సమాధానం ఇవ్వాల'ని సూచించారు. దీనిపై స్మృతీ ఇరానీ 'దిగువ స్థాయిలో విద్యా విధానంపై సంప్రదించని ఒకే ఒక రాష్ట్రం బీహార్‌' అని ఎద్దేవా చేశారు.

దీనిపై మండిపడ్డ విద్యాశాఖ మంత్రి 'ముందు మీరు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయండి. అప్పుడు నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేలిపోతాయి' అనిసమాధానమిచ్చారు. ఫేక్ హామీల విషయంలో మోడీ నుంచి స్మృతి నేర్చుకున్నారని, అలాగే ఇతరుల పైకి తోసేయడం నేర్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Union education minister Smriti Irani engaged in a wordy duel on twitter with Bihar's education minister, Ashok Choudhary of the Congress. It began with Ms Irani taking umbrage at Mr Choudhary addressing her as "Dear Smriti Iraniji". And ended with a climbdown by the Congressmen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X