పక్కనే కూర్చున్నారు: చంద్రబాబు ఇఫ్తార్ విందులో వైసీపీ ఎమ్మెల్యే
అమరావతి: ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' వైసీపీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆకర్ష్‌లో భాగంగా వైసీపీ టికెట్‌పై విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎప్పుడు, ఏ సందర్భంలో టీడీపీలోకి చేరతారో అంతుచిక్కడం లేదు. తాజాగా శుక్రవారం గుంటూరులో కనిపించిన ఓ దృశ్యం వైసీపీ నేతల్లో మరోసారి కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే... ముస్లింల పవిత్రమాసమైన రంజాన్‌ను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతమైన గుంటూరులో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసింది. ఈ విందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులు పల్లె రఘనాధరెడ్డి, పరిటాల సునీతలతో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఈ విందుకు ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, చాంద్ బాషా హాజరయ్యారు. వీరితో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన మహమ్మద్ ముస్తఫా కూడా హాజరయ్యారు.
The holy month of Ramadan brings a sense of discipline into us. Experienced this at an Iftar party in Guntur. pic.twitter.com/DkQNIDtv1u
— N Chandrababu Naidu (@ncbn) June 25, 2016
అయితే ఆయన స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ, వేదికపై సీఎం, టీడీపీ ఎమ్మెల్యేల పక్కన కూర్చోవడం పెద్ద చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు కూడా ఆయనకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఇలా టీడీపీ నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కనిపించడం వైసీపీ నేతల్లో కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications