మోడీ! బాబును ఇంకా దూరం పెడుతున్నారా?: ఢిల్లీలో ఏం జరిగింది?

న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరికోసం తీసుకున్న అపాయింట్‌మెంట్‌లు తిరస్కరించబడ్డాయని టీడీపీ ఎంపీ ఒకరు తెలిపారు.

మోడీతో భేటీ.. బాబుకు నిరాశే

మోడీతో భేటీ.. బాబుకు నిరాశే

కాగా, గత నెలన్నర రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కోసం ప్రయత్నిస్తున్నారు చంద్రబాబునాయుడు. ఈ నేపథ్యంలో మోడీ, చంద్రబాబునాయుడుల మధ్య దూరం పెరిగిందా? అనేది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన ప్రతీసారి చంద్రబాబుకు నిరాశే ఎదురవుతోందని పలువురు పేర్కొంటున్నారు. అయితే, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి అనడంలో సందేహం లేదు.

Recommended Video

    Chandrababu Naidu unhappy with Modi మోడీపై బాబు అసహనం, జగన్‌కు 20 శాతం ఆఫర్ | Oneindia Telugu
    భేటీ కుదరదని తేల్చేసిన పీఎంఓ

    భేటీ కుదరదని తేల్చేసిన పీఎంఓ

    సదరు టీడీపీ ఎంపీ తెలిపిన ప్రకారం.. సెప్టెంబర్ 25, 26తేదీల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరుతూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసింది. సెప్టెంబర్ 25న బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఉన్నందున ప్రధాని షెడ్యూల్ బిజీగా ఉందని, అపాయింట్‌మెంట్ ఇవ్వడం కుదరదని తేల్చి సీఎంకు పీఎం తేల్చి చెప్పింది. అయితే, 26న భేటీ గురించి మాత్రం స్పందించలేదు.

    ఆంతర్యమేమిటి?

    ఆంతర్యమేమిటి?

    ఈ క్రమంలో చంద్రబాబునాయుడు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీలతో సమావేశమయ్యారు. అయితే, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సెప్టెంబర్ 25న ఉ. 9.30కు అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పటికీ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటింగ్ మీటింగ్ నేపథ్యంలో ఆ తర్వాత ఎలాంటి స్పందనా రాలేదని ఎంపీ చెప్పారు. అయితే, ఇలా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం వెనుక ఏపీకిచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్రం అనుకోవడం లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయని తెలిపారు.

    బాబు ప్రయత్నం.. కేంద్రం మాత్రం..

    బాబు ప్రయత్నం.. కేంద్రం మాత్రం..

    ప్రధానితో భేటీకి అవకాశం దొరికితే ఏపీకి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే, కేంద్రం మాత్రం మిగితా రాష్ట్రాల్లానే ఏపీని కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రత్యేక హామీలను నెరవేర్చేందుకు అనుకూలంగా లేనట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు, ఈఏపీ ప్రాజెక్టులు, ఇతర ప్రత్యేక ప్రాజెక్టులపై కూడా కేంద్రం స్పందన అంతంత మాత్రమే ఉన్నట్లు తెలుస్తోందన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+