వృషణాలు కోసి శివాలయంలో సమర్పణ

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ వ్యక్తి తన రెండు వృషణాలను కత్తితో కోసుకుని శివాలయంలో నందికి సమర్పించిన ఘటన సంచలనం సృష్టించింది.

భువనేశ్వర్: ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ వ్యక్తి తన రెండు వృషణాలను కత్తితో కోసుకుని శివాలయంలో నందికి సమర్పించిన ఘటన సంచలనం సృష్టించింది.

జగన్నాథ ప్రసాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలసి గ్రామానికి చెందిన నటబర నాయక్‌ తరచూ పుల్లాంగి గ్రామంలోని నీలకంఠేశ్వర ఆలయంలో స్వామి దర్శనానికి వస్తుంటాడు.

ఎప్పటిలాగే శుక్రవారం మధ్యాహ్నం కూడా నాయక్‌ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మందిరానికి వచ్చి అక్కడ కొంతసేపు గడిపాడు. అనంతరం ఆలయంలోకి వెళ్లి తన రెండు వృషణాలను కోసుకుని వాటిని మందిరంలోని నంది వీపుపై ఉంచాడు.

Odisha man chops off his testicles

ఇది గమనించిన స్థానికులు నటబర నాయక్‌ను హుటాహుటిన భంజనగర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు రాత్రి బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆసుపత్రిలో చేర్పించారు.

నాయక్‌ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతనికి మూర్చ రోగము ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రోగం నుంచి కాపాడమని ఇలా చేశాడని చెబుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+