వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు తీరుపై అసహనం: కేబినెట్ భేటీకి కేఈ కృష్ణమూర్తి డుమ్మా

ఉప ముఖ్యమంత్రి, కర్నూలు జిల్లా నేత కేఈ కృష్ణమూర్తి కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇది ఇప్పుడు చర్చకు దారి తీసింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఉప ముఖ్యమంత్రి, కర్నూలు జిల్లా నేత కేఈ కృష్ణమూర్తి కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇది ఇప్పుడు చర్చకు దారి తీసింది. తన అసంతృప్తిని తెలియజేసేందుకే ఆయన కేబినెట్ సమావేశానికి రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి తన పట్ల అంత బాగా లేదని కేఈ కృష్ణమూర్తి అభిప్రాయంతో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

<strong>టిడిపిని వద్దంటారా!?: వీడియోలు చూసి సొంత నేతలకు బిజెపి షాక్</strong>టిడిపిని వద్దంటారా!?: వీడియోలు చూసి సొంత నేతలకు బిజెపి షాక్

కేఈ కృష్ణమూర్తి గతంలోను పలుమార్లు చంద్రబాబుపై తన అసంతృప్తిని తెలియజేశారు. ఇప్పుడు మరోసారి ఆయన కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టారు.

టిక్కెట్ పైన నాడు అసంతృప్తి

టిక్కెట్ పైన నాడు అసంతృప్తి

ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై కేఈ కృష్ణమూర్తి పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తన తమ్ముడు కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించలేదని కేఈ అలకబూనినట్లుగా ప్రచారం జరిగింది.

వారికి అలా అంటూ..

వారికి అలా అంటూ..

అనంతలో జేసీ సోదరులు కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కేటాయించారని, తమకు మాత్రం అలా చేయలేదని ఆవేదన చెందారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

మనస్పర్థలు ఉన్నాయని సోదరుడు

మనస్పర్థలు ఉన్నాయని సోదరుడు

నెల రోజుల క్రితమే కేఈ కృష్ణూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, తన సోదరుడు కేఈతో మనస్పర్థలు ఉన్నాయని, తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వని కారణంగానే అసంతృప్తి అని తెలిపారు.

తొలి నాళ్లలోనే అసంతృప్తి

తొలి నాళ్లలోనే అసంతృప్తి

రెండేళ్ల క్రితం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)లను బదలీ చేస్తూ కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు నిలిపివేశారు. కేఈ జారీ చేసిన నాలుగు ఉత్తర్వులను ఒకే ఒక్క జీవోతో చంద్రబాబు నిలిపివేశారు. ఇది కూడా ఆయనను ఆవేదనకు గురి చేసిందని తెలుస్తోంది.

English summary
Deputy Chief Minister KE Krishna Murthy has skipped the Cabinet meeting, leading to interesting discussions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X