అశ్వ‌గంధ టీ తో రెట్టింపు శక్తి, ఈ సమస్యలు దూరం..!!

అశ్వ‌గంధ‌. ఆయుర్వేదంలో ఒక శ‌క్తివంత‌మైన మూలిక‌. దీనికి ఎంతో చ‌రిత్ర ఉంది. అశ్వ‌గంధ‌లో ఎన్నో ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధుల‌కు ఔధ‌షంగా ప‌నిచేస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ ఉప‌యోగిస్తారు. అశ్వ‌గంధ‌ను రోజూ ఉపయోగిస్తే అనేక రోగాలు త‌గ్గిపోతాయ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అశ్వ‌గంధ మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో పొడి లేదా ట్యాబ్లెట్ల రూపంలో ల‌భిస్తుంది. టీ, కాఫీల‌కు బ‌దులుగా అశ్వ‌గంధ టీ ని ఉద‌యం లేదా సాయంత్రం ఒక క‌ప్పు తీసుకుంటే అనేక ప్రయోజనాలు అందుతాయి.

అశ్వ‌గంధ మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో పొడి లేదా ట్యాబ్లెట్ల రూపంలో ల‌భిస్తుంది. ట్యాబ్లెట్ల‌ను డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వాడుకోవాలి. ఇక పొడిని చాలా మంది ఉప‌యోగిస్తారు. దీన్ని నీటిలో వేసి మ‌రిగించి డికాష‌న్‌లా త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. అశ్వ‌గంధ టీని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. ఇందులో ఉండే అడాప్టొజెనిక్ గుణాలు మ‌న శ‌రీరంలో కార్టిసాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. కార్టిసాల్ అనేది ఒత్తిడిని క‌ల‌గ‌జేసే హార్మోన్‌. క‌నుక అశ్వ‌గంధ టీని తాగితే కార్టిసాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో ఒత్తిడి మాయ‌మ‌వుతుంది. మాన‌సిక ఆందోళ‌న త‌గ్గుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. అశ్వ‌గంధ టీని రాత్రి పూట సేవిస్తుంటే ఒత్తిడి, ఆందోళ‌న తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది.

ashwagandha-tea-has-many-benefits-improves-quality-of-life

అశ్వ‌గంధ‌లో ఇమ్యునో మాడ్యులేటింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. తెల్ల ర‌క్త క‌ణాలు అధికంగా ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాయి. ఏకాగ్ర‌త‌ను మెరుగు ప‌రుస్తుంది. మెద‌డు చురుగ్గా ప‌నిచేసేలా చేస్తుంది. మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది. మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది. అశ్వ‌గంధ‌లో విథ‌నోలైడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీని వ‌ల్ల గుండె పోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఈ టీని తాగుతుంటే శ‌రీర శ‌క్తి సామ‌ర్థ్యాలు పెరుగుతాయి. అశ్వ‌గంధ మొక్క వేర్లు ల‌భిస్తే వాటిని తెచ్చి ఎండ‌బెట్టి వాటితో మీరు కూడా పొడి త‌యారు చేసుకుని నిల్వ చేసుకోవ‌చ్చు. ఈ పొడిని నీటిలో వేసి మ‌రిగించి త‌రువాత వ‌డ‌క‌ట్టి ఆ నీళ్లు గోరువెచ్చ‌గా ఉండ‌గానే అందులో కాస్త తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌వ‌చ్చు. లేదా నేరుగా అయినా తాగ‌వ‌చ్చు. ఇలా అశ్వ‌గంధ టీని సేవిస్తుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చుని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+