రామబాణం.. ఈ మొక్క ఆకుల చూర్ణం

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా మంది సహజ సిద్ధమైన ఆయుర్వేద మూలికల వైపు మొగ్గు చూపుతోన్నారు. ఆయుర్వేదంలో మధుమేహ నివారణకు రామబాణంగా పనిచేసే మొక్కల్లో పొడపత్రి ఒకటి. దీన్ని గుడ్మార్, మధునాశిని అని పిలుస్తారు. రక్తంలో చక్కెర స్థాయిని నాశనం చేసేదని అర్థం.

పొడపత్రి ఆకులను చూర్ణంగా తీసుకోవాలి. ఇందులో ఉండే జిమ్నెమిక్ యాసిడ్ వంటి సహజ సిద్ధమైన మూలకాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సహజంగా పెంచడానికి దోహదపడతాయి. ఈ తీగ మొక్క ఆకులు, వేర్లు, కాండాలను వివిధ రకాల ఆయుర్వేద ఔషధాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తీపి తినాలనే కోరికను గణనీయంగా తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మధుమేహ నియంత్రణకే కాకుండా బరువు పెరగడాన్ని అరికట్టడానికి కూడా పొడపత్రి ఎంతగానో సహాయపడుతుంది.

Benefits of Gudmar with Naturally Support Blood Sugar Control and Metabolism Improves Glucose Balance

శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడం, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేయడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ మూలికలోని ఔషధ గుణాలు అద్భుతంగా తోడ్పడతాయి. పొడపత్రిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఎంతగానో సహకరిస్తాయి.

స్థానికంలో ఏకగ్రీవాలు జరిగితే నియోజకవర్గ ఇన్ ఛార్జీకి టికెట్ ఇవ్వను- ఆషామాషీగా తీసుకోవద్దు: జగన్
స్థానికంలో ఏకగ్రీవాలు జరిగితే నియోజకవర్గ ఇన్ ఛార్జీకి టికెట్ ఇవ్వను- ఆషామాషీగా తీసుకోవద్దు: జగన్

ఈ ప్రత్యేకమైన మూలిక మానవ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ మూలిక జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడమే కాకుండా మానసిక స్పష్టతను పెంచుతుంది. పొడపత్రిలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు మెదడు కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి.

సికింద్రాబాద్, ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లే ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ఇకపై - హాల్ట్ స్టేషన్లు!!
సికింద్రాబాద్, ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లే ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ఇకపై - హాల్ట్ స్టేషన్లు!!

ఇది వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు శారీరక మార్పులు, నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను నిరోధించడంలో కీలకంగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా, గ్లూకోజ్ మార్పుల వల్ల మెదడు పనితీరు దెబ్బతినకుండా పొడపత్రి అడ్డుకుంటుంది. ఈ ప్రక్రియ మానసిక అలసటను తగ్గించి, రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. నిత్యం ఒత్తిడితో కూడిన జీవనశైలిని గడిపే వారికి మెదడు చురుకుదనాన్ని, మెరుగైన ఆలోచనా సామర్థ్యాన్ని అందించడంలో ఈ ఆయుర్వేద మూలిక ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఎలాంటి సరైన వైద్య సలహా లేకుండా దీనిని అతిగా తీసుకుంటే శరీరానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎక్కువగా వాడితే హైపోగ్లైసీమియా.. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా పడిపోతుందని చెబుతున్నారు. ఈ ఆకులను ఉపయోగించడం వల్ల కొందరిలో జీర్ణక్రియకు సంబంధించిన రుగ్మతలు కనిపిస్తాయి. ఆరంభంలో కడుపు ఉబ్బరం, గ్యాస్, తీవ్రమైన కడుపు నొప్పి, వికారం లేదా జీర్ణకోశ ఇబ్బందులు కలగవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+