ఇవి తినండి... ఆగకుండా పరిగెత్తుతారు

కాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. పాలు, పెరుగు వంటివి కాల్షియం ప్రధాన వనరులు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉండటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంతోపాటు ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది. కండరాలు పనిచేయడానికి, నరాలు పనిచేయడానికి కూడా ఇది ఎంతో అవసరం. రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనపడటంతోపాటు ఆస్టియోపోరోసిస్, కండరాల నొప్పి, దంతాలు పాడవడం, రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతుంటాయి. విటమిన్ డి చాలా ముఖ్యం. సూర్యకాంతి, చేప నూనె వంటి ఆహారాల ద్వారా విటమిన్ డిని పొందవచ్చు. పాలు, పెరుగు, చీజ్, పనీర్, కేఫీర్, తృణధాన్యాలు, విత్తనాలు,
బాదం, ఆవాలు, చియా సీడ్స్, అల్సీ గింజలు, రాజ్‌మా, చిక్‌పీస్, ఆకు కూరలు, పాలకూర, బచ్చలికూర, కాలే, బ్రోకలీ, కొత్తిమీర, సోయాబీన్, టోఫు, సాల్మన్, సార్డిన్లు, గుడ్లు, ఫిగ్స్, నారింజల్లో లభిస్తుంది.

calcium health benefits and uses in telugu

సోయా సీడ్స్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. 28.35 గ్రాముల చియా సీడ్స్‌లో 179 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. వీటిల్లో ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి12 కూడా ఉంటాయి. ఎముకలు, పళ్లకు కూడా కాల్షియం చాలా అవసరం. కాల్షియం లోపించడంవల్ల వేళ్లు, పాదాలు, కాళ్లలో తిమ్మిరి, ఒకవిధమైన జలదరింపు, కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం, బద్ధకం, తీవ్రమైన అలసట, బలహీనమైన, పెళుసుగా ఉండే గోర్లు, దంత సమస్యలు, దంతాలు రావడంలో ఆలస్యం జరుగుతుండటం, తికమకగా అనిపించడం, ఆకలి లేకపోవడంలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+