Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోజూ చపాతీలు తింటున్నారా - ఈ జాగ్రత్తలు అవసరం, లేదంటే..!!

ప్రస్తుత కాలంలో జీవన శైలి.. ఆహారపు అలవాట్లలో మార్పు కనిపిస్తోంది. ఎక్కువ మంది రాత్రి వేళ చపాతి తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అధిక బరువుతో నియంత్రణతో పాటుగా అనేక ఆరోగ్య సమస్యలకు చపాతీ ఆహారం మేలు చేస్తుంది. ఇదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవా ల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. చపాతీలతో పాటుగా తీసుకునే కూరల విషయంలోనూ పలు సూచనలు చేసారు. చపాతీలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఎవరికి సమస్యలు వస్తాయనే అంశం పైన స్పష్టత ఇస్తున్నారు.

చపాతీలు సాధారణంగా గోధుమపిండితో తయారు చేస్తారు. ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని, మలబద్ధకాన్ని నివారిస్తుందని, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో బి1, బి2, బి3, బి6, బి9, ఇ విటమిన్లతో పాటు ఐరన్, కాపర్, మాంగనీస్​, సిలికాన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, అయోడిన్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని పేర్కొంటున్నారు. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు. చపాతీలు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయని, డయాబెటిస్​తో బాధపడుతున్న వారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించా లనుకునే వారికి మంచిది. చపాతీల్లో ఉండే బి విటమిన్లు, జింక్, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహకరిస్తాయి. చపాతీలు గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!!
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!!
chapatis-are-low-in-fat-and-rich-in-fibre-they-are-a-healthier-alternative-to-refined-flour-based-b

చపాతీలు తీసుకుంటూనే... జాగ్రత్తలు అవసరం

చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల బాడీలో అనవ సర కొవ్వులు చేరతాయని నిపుణులు చెబుతున్నారు. పుల్కా చేసుకొని తింటే మరీ మంచిదని పేర్కొంటున్నారు. మార్కెట్లో దొరికే పిండిలో మైదా కూడా కలిసి ఉంటుందని, కాబట్టి ముడి గోధుమ లు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది. చపాతీ లో కాంబినే షన్ కోసం పప్పు.. బంగాళాదుంప కర్రీ అని కాకుండా అన్ని రకాల కాయగూరలతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో క్యారెట్ ముక్కలు, బీన్స్, పాలకూర వంటి వాటిని ఉడికించి, గోధుమ పిండి కలుపుకొని చపాతీలు చేసు కుంటే అటు రుచికి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం. గోధుమపిండికి రాగి పిండి, సోయాబీన్ పిండి, చిరుధాన్యాలతో తయారుచేసిన పిండి వంటివి కూడా కలుపుకొని చపాతీ తయారు చేసుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+