Health Tips: మలబద్ధకంతో బాధ పడుతున్నారా.. అయితే ఈ పని చేయిండి చాలు..!
మలబద్ధకంతో బాధపడే వారు పలు రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది మలబద్ధకం సమస్య ఎదుర్కొటున్నారు. బాత్ రూమ్ కు వెళ్లి గంటల తరబడి కూర్చుంటున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని అలవాట్ల ద్వారా మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. మలబద్ధంక సమస్య తగ్గిపోవాలంటే.. నీళ్లు ఎక్కువగా తాగాలి. నీటిని పుష్కలంగా తాగితే ఎన్నో సమస్యలు దూరమవుతాయి.

నీరు
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగితే మంచిద. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటే మంచిది. అలాగే వీలైనంత ఎక్కువ సేపు నడవడం కూడా మంచిదట. అముద నూనెని మలబద్ధకానికి టెంపరరీ సొల్యూషన్‌గా వాడొచ్చు. దీనిని వాడడం వల్ల ప్రేగులు క్లీన్ అవుతాయి. ఆముదాన్ని తీసుకున్నప్పుడు అది చిన్న ప్రేగుల్లో విచ్చిన్నమై ప్రధాన కొవ్వు ఆమ్లం రిసినోలిక్ యాసిడ్‌ని రిలీజ్ చేస్తుంది. ఇది నేచురల్‌గా మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది.

ఫైబర్
భోజనంలో ఎక్కువ మొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు, ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని ఉండేలా చూసుకోవాలి. పీచు మోతాదులు పుష్కలంగా ఉండే పుచ్చకాయలు, బొప్పాయి, నారింజ వంటి పండ్లు తీసుకుంటే మంచిది. చిక్కుడు కాయల వంటి కూరల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. చిక్కుళ్లు కండరాల రిపేర్లకూ, శక్తికీ, ఆరోగ్యకరమైన కండరాలకూ ఉపయోగపడతాయి. క్యారట్, బీట్‌రూట్ వంటి వాటిల్లోనూ ఫైబర్ ఎక్కువే. వీటిని కూరలుగా తీసుకుంటే మంచిది.

త్రిఫల చూర్ణం
మలబద్ధం ఉన్నవారు త్రిఫల చూర్ణం వాడడం మంచిది. ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో తయారు చేసిన త్రిఫల చూర్ణం తీసుకుంటే మలబద్ధం సమస్య తగ్గుతుంది. ఈ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం త్రిఫల చూర్ణం వాడితే కంటి సంబంధ సమస్యలు, జుట్టు రాలటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తగ్గే అవాకసం ఉందట.












Click it and Unblock the Notifications