ఇంట్లోనే యమ్మీ యమ్మీ చీజీ పాస్తా- బ్రేక్ఫాస్ట్గా తయార్
చీజ్ లేకుండానే క్రీమీ, చీజీ పాస్తా ఎలా తయారు చేయాలో చాలామందికి తెలియకపోవచ్చు. పాల ఉత్పత్తులను తినడానికి ఇష్టపడని వారు, శాకాహారుల కోసం ఈ రెసిపీ బెస్ట్ ఛాయిస్. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అందుబాటులో ఉండే పదార్థాలతోనే దీన్ని ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ గా ఈ చీజీ పాస్తాను తీసుకోవచ్చు. అద్భుతమైన రుచిని అందించే ఈ వంటకం తయారీ విధానం చూద్దాం.
ముందుగా మీకు నచ్చిన పాస్తా రకాన్ని ఎంచుకోండి. పాస్తాలో స్పఘెట్టి కార్బొనారా, పెన్నె, ఫుసిల్లి, మకరోనీ వంటి రకాలు ఉన్నాయి. వాటిల్లో మీకు ఇష్టమైన రకాన్ని ఎంచుకోవచ్చు. వాటిల్లో ఉప్పు వేసిన వేడి నీటిలో పాస్తాను అల్ డెంటె అయ్యే వరకు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని తీసి పక్కన పెట్టాలి.

చీజ్ లేకుండా క్రీమీ సాస్ తయారు చేయడానికి కిచెన్ లో ఉండే పదార్థాలు సరిపోతాయి. సగం కప్పు జీడిపప్పును 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం మెత్తటి పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేయాలి. మిక్సీలో వేసినా చాలు. చీజీ రుచి కోసం న్యూట్రిషనల్ ఈస్ట్ ను వాడాలి. క్రీమీగా మారడానికి పాలను మిక్స్ చేయాలి. రుచి కోసం కొద్దిగా ఆలివ్ నూనెలో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయను వేయించండి. ఉప్పు, బ్లాక్ పెప్పర్, ఎండు మిరప, చిటికెడు పసుపు వేయండి.
ఈ పదార్థాలన్నింటినీ కలిపి స్టవ్ మీద తక్కువ మంటపై సాస్ చిక్కగా తయారయ్యేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత అందులో బ్రోకలీ, బెల్ పెప్పర్స్, అందుబాటులో ఉంటే మష్రూమ్స్, పాలకూర లేదా బఠానీలు వంటి కూరగాయలను అడిషనల్ గా చేర్చవచ్చు. వీటిని వాడటం వల్ల రుచితో పాటు పోషకాలు కూడా అందుతాయి. మరింత రుచి లేదా ప్రొటీన్ కోసం చిక్‌పీస్ లేదా టోఫును కూడా ఉపయోగించవచ్చు.
కూరగాయలను సాస్‌లో కలపడానికి ముందు తేలికగా ఉడికించుకోవాలి. ఉడికించిన పాస్తాను క్రీమీ సాస్, కూరగాయలతో బాగా మిక్స్ చేయాలి. ప్రతి పాస్తా పీస్ కు కూడా సాస్ పట్టేలా చూసుకోవాలి. తాజా పార్స్‌లీ లేదా తులసి వంటి హెర్బల్స్, నట్స్, ఆలివ్ ఆయిల్ లేదా వేగన్ బటర్ వంటివి టేస్ట్ కోసం ఉపయోగించవచ్చు. సాస్ చిక్క మరింత చిక్కగా రావడానికి పాస్తా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. ఇది క్లాసిక్ చీజీ టేస్ట్ ఇస్తుంది.












Click it and Unblock the Notifications