శీతాకాలంలో ఈ పండు అమృతంతో సమానం.. అది ఏదో తెలుసుకోండి!

భగవంతుడు మనకు కాలానికి అనుగుణంగా పండ్లను సృష్టించి ఇచ్చాడు. తప్పనిసరిగా వాటిని తీసుకోవాలి. శీతాకాలంలో ఒక పండు మాత్రం కచ్చితంగా తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో అది అమృతంతో సమానమని చెబుతున్నారు. అది ఏదో కాదు బొప్పాయి పండు. ఇది రుచిగా ఉండటమే కాదు అనేకరకాలైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు
బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ మాంసాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. బొప్పాయిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటంతోపాటు గుండెపోటు, స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను నివారిస్తుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేసి, ముడతలు పడకుండా కాపాడతాయి. ఇది మచ్చలు, మొటిమలు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. బొప్పాయిలో ఉండే కొన్ని పదార్థాలు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించే గుణాలు కలిగి ఉంటాయని తేలింది. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి మంచిది. ఇది మచ్చలు, కంటి చూపు తగ్గడం వంటి సమస్యలను నివారిస్తుంది.

eating papaya fruit health benefits and uses

బొప్పాయిని తీసుకునే విధానం
బొప్పాయిని తొక్క తీసి, గింజలు తీసేసి ప్రత్యక్షంగా తినొచ్చు. జ్యూస్ చేసి తాగొచ్చు. అలాగే సలాడ్‌లలో బొప్పాయిని కలిపి తీసుకుంటారు. కొందరు స్మూతీలలో బొప్పాయిని కలిపి తాగుతారు. కొంతమందికి బొప్పాయి వల్ల అలర్జీ ఉండవచ్చు. అందువల్ల, మొదటిసారి తినే ముందు కొద్ది పరిమాణంలో తీసుకోవడం మంచిది.
గర్భిణీ స్త్రీలు బొప్పాయిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. చాలా తక్కువగా తీసుకోవాలి. బొప్పాయి చర్మాన్ని కాస్త చికాకు పెడుతుంది జాగ్రత్తగా ఉండాలి. దీనిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అధికంగా కాకుండా సమతులంగా తీసుకోవడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+