గ్రీన్ టీ తాగుతున్నారా...అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!!
గ్రీన్ టీ. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు, డీటాక్స్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా తాగుతారు. అయితే చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచు తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను క్లీయర్ చేస్తుంది. కానీ, గ్రీన్ టీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. లేదంటే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆరోగ్య పరమైన సమస్య లు ఎదుర్కొంటున్న వారు సైతం గ్రీన్ టీ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
గ్రీన్ టీ ఈ మధ్య కాలంలో వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఆరోగ్య పరమైన ప్రయోజనా ల కారణంగా చాలా మంది గ్రీన్ టీ వైపు ఆసక్తి చూపుతున్నారు. గ్రీన్ టీలో ఫ్రీ రాడికల్స్‌ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెటబాలిజంను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేసి శక్తిని ఇస్తుంది. మెదడును ఉత్తేజ పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ మేలు చేసేవి కాగా, ఉదయం వేళ ఖాళీ కడుపున తీసుకునే వారికి సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి కడుపు ఆమ్లతను పెంచుతాయి. మీకు వికారం లేదా ఉబ్బరం కలిగిస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో టానిన్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. అయితే, ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మన కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి.అజీర్తి చేస్తుంది.

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. ఇది గ్యాస్ట్రిక్, యాసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కడుపులో యాసిడ్ స్థాయి పెరిగి గ్యాస్, మలబద్ధకం, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఖాళీ కడుపున కాకుండా.. భోజనం తర్వాత లేదా టిఫిన్‌తో పాటు గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇదే సమయంలో దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పూర్తిగా ప్రభావితం కావడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. గ్రీన్ టీలోని టానిన్లు శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీంతో, రక్తహీనత సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. రక్తహీనత సమస్య ఉన్నవారు గ్రీన్ టీ తాగడం వల్ల ఐరన్ లోపం మరింత ఎక్కువ కావచ్చు. అధిక మోతాదులో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్‌పై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఇప్పటికే లివర్ సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications