రోజుకు 20 కప్పుల టీ తాగుతూ.. 8 నెలల్లో 38 కేజీలు తగ్గింది.. ఎలా సాధ్యం..?

మనుషులందరూ ఒకేలా ఉండరు. కొందరు సన్నగా ఉంటే, కొందరు లావుగా ఉంటారు. ఇది శరీర స్వభావాల మీద ఆధారపడి ఉంటుంది. సన్నగా ఉండేవారికి బరువు పెరగాలనే కోరిక ఉంటుంది. లావుగా ఉండేవారికి తగ్గాలనే ఆశ ఉంటుంది. అధిక బరువు శరీరాకృతినే కాదు, ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. ఇక నేటి యువత అనారోగ్యకరమైన ఆహారం, అధిక కొవ్వు, చక్కెరలు ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడంతో పాటు.. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వలన బరువు పెరుగుతున్నారు.

అయితే ప్రస్తుతం ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. యూకేలోని లింకన్‌ షైర్‌ కు చెందిన సుసాన్ గార్నర్ వయసు 61 ఏళ్లు. ఆమెకు టీ తాగడం అంటే ఓ వ్యసనం. ప్రతిరోజూ 20 కప్పుల టీ తాగడం ఆమె దినచర్యలో భాగంగా ఉండేది. అలా వారానికి 140 కప్పుల టీ.. ప్రతి మూడు రోజులకు ఒక కిలోగ్రాము చక్కెర తినేది అన్నమాట. దీంతో ఆమె బరువు బరువు 95 కిలోలకు పెరిగింది.

దీంతో ఆమె వైద్యుడిని సంప్రదించగా.. వైద్యులు ఆమెకు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించే ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడే మౌంజారో అనే మందును సూచించారు. ఈ మౌంజారో మందు ప్రారంభ మోతాదు 2.5 mg ఉంటుంది. ఆ తర్వాత 7 mg కు పెరిగింది. దీంతో మొదటి వారంలోనే సుమారు 3 కిలోలు తగ్గింది. మౌంజారోతో పాటు NHS మార్గదర్శకాలను పాటించింది. అంటే.. రోజుకు 10 వేల అడుగులు నడవడం, కనీసం 2 లీటర్ల నీరు తాగడం, అలాగే రోజూ 5 సార్లు పండ్లు, కూరగాయలు తీసుకోవడం చేయాలి.

From Sugar Overload to Slimdown Success Susan Garner s 38kg Tea Habit Makeover Shocks Everyone

అయితే సుసాన్ కు టీ తాగే అలవాటు మానలేదు. ఇప్పుడు చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్‌ ను ఉపయోగిస్తోంది. ఇది చక్కెర కాదు.. తీపిని ఇస్తుంది. అలా ఎనిమిది నెలల్లోనే దాదాపు 38 కిలోల బరువు తగ్గింది. తాను 10 సంవత్సరాలు చిన్నదానిగా మారినట్లు సుసాన్ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+