రోజుకు 5 నిముషాలు.... మిమ్మల్ని మించిన ఆరోగ్యవంతులే ఉండరు

రోజురోజుకు జీవనశైలి మారుతోంది. ఆహారపు అలవాట్లు ఇప్పటికే మారాయి. దీనికితోడు ఉద్యోగాల్లో ఎక్కువ శాతం అన్నీ కూర్చొని చేసేవే. దీంతో గంటల తరబడి అలా కూర్చోవడంవల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. జంక్ ఫుడ్ కూడా తీవ్రమైన అనారోగ్యానికి దారితీయిస్తోంది. ఎంత కూర్చొని చేసినా, ఏ ఉద్యోగం చేసినా ప్రతిరోజు వ్యాయామం చేయడం అనేది చాలా ప్రధానం. మనకు వచ్చే రోగాలన్నీ ఆహారపు అలవాట్లవల్లే వస్తాయి. వాటిని మనదరికి చేరనీయకుండా ఉండాలంటే మన దగ్గర ఒకటే ఆయుధం ఉంది. అదే పరుగు.

దీర్ఘకాలిక వ్యాధులన్నీ దూరంగా వెళ్లిపోతాయి
ప్రతిరోజు 20 నిముషాల చొప్పున పరుగు ఉంటే చాలు.. భవిష్యత్తు అంధకారం అవకుండా ఉంటుంది. అధిక సమయం ఫోన్లు చూస్తుండటం, దగ్గరలో షాపుకు వెళ్లాలన్నా బండి వాడటంలాంటి అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఉదయం ఎనిమిది గంటల వరకు నిద్రపోతుండటంవల్ల కూడా చక్కెర వ్యాధి, రక్తపోటు, అధిక బరువు, గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటివి వస్తుంటాయి. పరుగు ఎంత ముఖ్యమైంది అంటే ఐదు నిముషాల పరుగు తీశామంటే దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు కూడా దూరంగా వెళ్లిపోతాయి. బయట, స్టేడియంలో పరిగెత్తడానికి అవకాశం లేనివారు జిమ్ లో థ్రెడ్ మిల్ మీద చేసినా చాలు. జిమ్ లో అనేక వ్యాయామాలు ఉంటాయి. ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకొని చేస్తే క్యాలరీలు కరిగిపోతాయి.

Health benefits of jogging every day

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది
క్యాలరీలు భారీగా కరగాలంటే ప్రతిరోజు 20 నిముషాల పరుగు ఉండాలి. ఆ పరుగుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. మెదడుకు తగిన ప్రాణ వాయువు అందుతుంది. శరీరంతో పాటు మెదడూ ఉత్సాహంగా స్పందిస్తుంది. కండరాల సాంద్రత పెరగడంవల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. సూర్య కిరణాలు, ప్రకృతి, చల్లటి వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. మహిళలకు భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. అధిక బరువు, రక్తపోటు, చక్కెర స్థాయులు తగ్గుతాయి. గుండె జబ్బులు నుంచి పూర్తిస్థాయిలో రక్షణ పొందడంతోపాటు ఒంట్లోని చెడు కొలెస్ట్రాల్​ కరిగిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+