health tips: ఆరోగ్యంగా ఉండాలంటే పరగడుపున తినకూడనివి, తాగకూడనివి ఇవే!!
ఆరోగ్యంగా ఉండాలంటే పరగడుపున తినకూడనివి, తాగకూడనివి ఏమిటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలి.
కొంతమంది ఉదయం లేచిన వెంటనే ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న అన్న విషయాలను పట్టించుకోకుండా ఏదో ఒకటి తింటూ ఉంటారు. అయితే అలా తింటే అనవసరమైన అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్టు అవుతుందని చెబుతున్నారు డైటీషియన్లు. పరగడుపున ఏది పడితే అది తింటే జీర్ణ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుందని అందుకే ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.

పరగడుపున పులుపు ఆహారం తింటున్నారా?
ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం ఎప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారమై ఉండాలి. పొద్దున్నే తీసుకునే ఆహారంలో పుల్లటి వస్తువులను తీసుకోకూడదు. ముఖ్యంగా పుల్లటి పండ్లను ఉదయం తినడం ఏమాత్రం మంచిది కాదు. పుల్లటి పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులో అల్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

పరగడుపున పచ్చి కూరగాయలు తింటే జరిగేదిదే
ఇక ఉదయం పరగడుపున ఆహారం తీసుకునేటప్పుడు చాలామంది పచ్చి కూరగాయలను తింటూ ఉంటారు. అయితే అది కూడా మంచిది కాదని చెబుతున్నారు డైటీషియన్లు. ఉదయం తింటే పొత్తికడుపులో నొప్పి వస్తుందని వీటిలో ఫైబర్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని, దీనివల్ల అవి జీర్ణం కాకుండా, అనవసరమైన అజీర్ణ సమస్యలు వచ్చి పొత్తికడుపులో నొప్పిగా ఉంటుందని చెబుతున్నారు.

చాక్లెట్లు, క్యాండీలు పరగడుపున తింటున్నారా?
ఇక ఉదయం పరగడుపున పొరపాటున కూడా చాక్లెట్లను, క్యాండీలను తినకూడదని సూచిస్తున్నారు. చాక్లెట్లు, అది మన క్లోమంపై దుష్ప్రభావాన్ని చూపి భవిష్యత్తులో కాలేయాన్ని బలహీనం చేసే ప్రమాదం ఉంటుందని క్యాండీలు తినడం వల్ల, వీటిలో చక్కెర కంటెంట్ ఉండడం వల్ల ఇవి ఆరోగ్యాన్ని బాగా పాడుచేస్తాయని చెబుతున్నారు. ఇక ఉదయం పరగడుపున చాలామంది కాఫీలను, టీలను తాగుతూ ఉంటారు. అవి ఏ మాత్రం తీసుకోదగినవి కావని అంటున్నారు. అయితే కాఫీ తాగడం కూడా ఏమాత్రం మంచిది కాదని కాఫీలో కెఫెన్ అనే పదార్థం ఉండడం వల్ల అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపి ఎసిడిటీకి కారణంగా మారుతుందని చెబుతున్నారు.

బాగా స్పైసీ ఆహారం తింటున్నారా? జాగ్రత్త
ఇక పరగడుపున చాలా మంది బాగా ఘాటుగా ఉన్న ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. దీనివల్ల కడుపులో ఆహారం జీర్ణం కాదు. అందుకే ఉదయాన్నే ఎట్టి పరిస్థితులలోనూ కారం కారంగాను, మసాలాలతోను వండిన ఎక్కువ స్పైసీ ఫుడ్ ను తినడం మంచిది కాదని చెబుతున్నారు. ఇక పరగడుపున పెరుగును కూడా తినకూడదని, ఉదయాన్నే పెరుగును తినడం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుందని చెబుతున్నారు.
పరగడుపున అరటిపండును కూడా తినకూడదని, పరగడుపున అరటిపండు తింటే దానిలోని మెగ్నీషియం రక్తంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. పరగడుపున కూల్ డ్రింక్స్, సోడాలు వంటివి కూడా తాగకూడదు. వాటి వల్ల కూడా అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications