పిల్లల్లోనూ హైబీపీ, లక్షణాలు..కారణాలు - జాగ్రత్తలు..!!
అధిక రక్తపోటు. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. మారుతున్న జీవన శైలి.. ఆహారపు అలవాట్లతో బీపీ తో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. నిత్యం ఒత్తిడితో కూడుకున్న జీవితం, శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడంతో యువత లోనూ రోజూ బీపీ ట్యాబ్లెట్స్ వేసుకునే పరిస్థితి వచ్చింది. కాగా.. తాజా అధ్యయనాల్లో బీపీ లక్షణాలతో బాధ పడుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతున్నట్లు గుర్తించారు. అయితే.. చిన్నారుల్లో బీపీ లక్షణాలు.. ఇందుకు కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
చిన్నారుల్లో బీపీ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన సమయంలో గుర్తిస్తే వెంటనే చికిత్స అందించడం ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. పిల్లల్లో అధిక రక్తపోటు జన్యుపరమైన సమస్యల కారణంగా వస్తుందని చెబు తున్నారు. 5 నుంచి 10 ఏళ్ల మధ్యలో హైబీపీ తాలుకూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల్లో ఉన్నట్లుండి వాంతులు కావడం, హృదయ స్పందనలో పెరుగుదల కనిపించడం, తీవ్రమైన తలనొప్పి వేధించడం, ఉన్నట్లుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకస్మిక చమట వంటి లక్షణాల ఆధారంగా హైబీపీని గుర్తించవచ్చని చెబుతున్నారు. చిన్నారుల్లో అధిక రక్తపోటు రాకుండా ఉండాలంటే పిల్లల్లో బరువును చిన్నప్పటి నుంచే నియంత్రించాలి. వీలైనంత వరకు శారీరక శ్రమకు ప్రాధాన్యతను ఇవ్వాలి.

పిల్లల్లోనూ దీర్ఘ కాలంగా బీపీ కొనసాగితే ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. గుండె కండరం మందం కావొచ్చని చెబుతున్నారు. ఇది గుండె వైఫల్యానికి దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. కిడ్నీ, మెదడు, కళ్లు వంటి వాటి పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పిల్లల్లో హైబీపీ చికిత్సలో మందుల కన్నా జీవనశైలి మార్పులకే అధిక ప్రాధాన్యం ఉందంటున్నారు నిపుణులు. తాజా కూరగాయలు, పండ్లు, పీచుతో కూడిన ఇతర పదార్థాలు ఎక్కువగా తినటం, రోజూ కనీసం అరగంట పాటు పరిగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈత కొట్టటం వంటి వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. . పిల్లలకు ఒకసారి పరీక్ష చేస్తే చాలదని, కనీసం రెండు సార్లయినా పరీక్షించాలని అంటున్నారు. రెండు సార్లూ బీపీ ఎక్కువుంటేనే అధిక రక్తపోటు ఉందని అనుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలా వేర్వేరు రోజుల్లో కనీసం మూడు సార్లు పరీక్ష చేసి సమస్యను నిర్ధారించాల్సి ఉంటుంది. చక్కెరతో చేసే పానీయాలు, సంతృప్త కొవ్వు పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications