Honey Water Vs Lemon Water: రెండింట్లో ఏది బెస్టో తేల్చుకోక తప్పదు
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన పానీయాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఉదయం పూట శరీరాన్ని ఉత్తేజపరిచి, మనసుకు ఉత్సాహాన్నిచ్చే హెల్త్ డ్రింక్స్ ను స్వీకరించడానికి చాలామంది ఇష్టపడతారు. బరువు తగ్గడానికి, శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండటంలో వీటికి ప్రాధాన్యత ఇస్తారు.
అందులో తేనె కలిపిన మంచి నీళ్లు, నిమ్మ రసం ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇవి రెండూ తయారు చేసుకోవడం సులభం కూడా. పైగా అనాదిగా వస్తోన్న సంప్రదాయ ఆరోగ్య పద్ధతులలో ఓ భాగం కూడా. ఈ రెండింటిలో ఏది మీ రోజువారీ దినచర్యకు సరైన ఎంపిక అనేది వ్యక్తిగత ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.

హనీ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. తేనెలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది కెఫిన్ మాదిరిగా కాకుండా, శక్తి క్షీణత లేకుండా సహజమైన ఉత్తేజాన్ని ఇస్తుంది. తేనె కలిపిన నీళ్లు జీర్ణక్రియకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
గోరువెచ్చని హనీ వాటర్ కడుపును తేలిక పరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు హానికారక కణాలను నిరోధించగలవు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్, అంటువ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
నిమ్మ రసం విటమిన్ సీకి మంచి వనరు. విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తి కావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిమ్మ రసం శరీరంలో క్షార ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇది శరీర సమతుల్యతను కాపాడుతుంది. నిమ్మ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.
హనీ వాటర్, నిమ్మ రసం రెండూ ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో దేన్ని రోజూ వినియోగించాలనేది వారి వ్యక్తిగత ఆరోగ్య అవసరాలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటినీ మార్చి మార్చి తీసుకోవడం లేదా మితంగా కలిపి తీసుకోవడం వల్ల రెండు పానీయాల ప్రయోజనాలను పొందవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు లేదా చక్కెర వినియోగాన్ని పరిమితం చేయాలని భావించే వాళ్లు హనీ వాటర్ కు దూరంగా ఉండటం బెటర్. ఇక నిమ్మరసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల దంతాల ఎనామిల్ క్షీణించే అవకాశం ఉంది.
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాగా పరిగణించరాదు. మీ రోజువారీ ఆహారంలో లేదా ఆరోగ్య దినచర్యలో ఏవైనా మార్పులు చేసుకునే ముందు వైద్యుడిని లేదా అర్హత కలిగిన పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.












Click it and Unblock the Notifications