తాటి ముంజలు - బీపీ, షుగరు, లివర్ బాధితులకు ఊహించని ప్రయోజనాలు..!!

వేసవిలో తాటి ముంజలకు ఓ ప్రత్యేకత ఉంది. వాటి పొట్టుతీసి, నోట్లో వేసుకుంటే ఐస్‌లా కరికి పోవాల్సిందే. లేత కొబ్బరిని తలపించే, తాటి ముంజల్లోని నీళ్లు అమృతాన్ని తలపిస్తాయి. ఏడాదిలో ఒక్కసారే.. అదీ మండే ఎండలకు చెక్‌ పెడుతూ వచ్చే తాటి ముంజలు కాలానికి తగ్గట్టుగా వివిధ రుచుల్లో లభిస్తున్నాయి. వేసవిలో దాహార్తిని తీర్చడమేగాక, పోషకాల గనిగా వీటికి పేరుంది. డీహైడ్రేట్ సమస్య నుంచి బయట పడేందుకు ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన వరప్రసాదమే తాటి ముంజలు. వీటితో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎక్కువ నీటి శాతం ఉన్నందున తాటి ముంజలు శరీరం నిర్జలీకరణం కాకుండా నివారిస్తాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. విటమిన్‌ సి, కె, ఈ లతో పాటు ప్రొటీన్‌, ఐరన్‌, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. అయితే.. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే కొన్నవెంటనే ఫ్రెష్‌గా తినడం మంచిది. ఒకవేళ ఫ్రిజ్‌లో పెట్టినా రెండు మూడు రోజుల్లోపే తినేయాలి. ముంజల్లో A, C, E, K విటమిన్లతోపాటుగా B-కాంప్లెక్స్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు కూడా దండిగా ఉంటాయని చెబుతున్నారు. ముంజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయట పడొచ్చని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎసిడిటీ, అల్సర్ వంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా రిలీఫ్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ice-apples-are-a-rich-source-of-vitamins-and-minerals-and-they-may-be-beneficial-for-people-with-di

ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు

తాటి ముంజలు ఆరగిస్తే కొంతమేరకు డీహైడ్రేషన్‌ బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్‌ చేసి వడదెబ్బకు గురికాకుండా కాపాడతాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయి. అందుకే వీటిని తిన్నవెంటనే శరీరం రీఫ్రెష్‌ అవుతుంది. తాటి ముంజల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తి లభిస్తుంది. ఎండా కాలంలో వేధించే చర్మ సమస్యలు, అలర్జీలను నివారించడానికి కూడా ఇవి నేచురల్ మెడిసిన్ మాదిరిగా పనిచేస్తాయని, ముంజల గుజ్జును రాసుకుంటే పొడిబారిన చర్మం నిగారిస్తుందని సూచిస్తున్నారు. తాటిముంజ ల లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. బాడీలోని వేస్టేజ్​ను బయటకు పంపించడంలో ముంజలు చాలా హెల్ప్ చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయని, లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతాయని కిడ్నీలు, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మూత్ర సంబంధిత ఇబ్బందులను తగ్గించడంతోపాటు, డయాబెటిస్‌ నియంత్రణలోనూ ముంజలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. వీటివల్ల దాహం తీరడమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+