ఇడ్లీ, దోశ ఎక్కువగా తింటున్నారా?
ఇడ్లీ, దోశను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. వాటి రుచి ఆ విధంగా ఉంటుంది. వీటిని వేయడానికి ఉపయోగించే పిండిని పులియబెట్టడంవల్ల ఆ రుచి వస్తోంది. మనలో ఎక్కువమంది పులియబెట్టిన ఆహార పదార్థాలు తినడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ రాత్రివేళల్లో ఇలాంటి ఆహారాలను తీసుకోవచ్చా? లేదా? అనే ప్రశ్న మెదులుతుంటుంది.
కొన్ని సర్వేల ప్రకారం పులియబెట్టిన పదార్థాలను తినడంవల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇవి జీర్ణశక్తిని పెంచి శరీరంలో రోగనిరోధకశక్తిని మెరుగుపరచడానికి తోడ్పడతాయి.
బియ్యం, మినప పప్పు నానబెట్టిన తర్వాత మిక్సీలోకానీ, గ్రైండర్ లోకానీ వేసి పిండిని తయారు చేస్తారు. వీటితో ఎన్నిరకాల పదార్థాలైనా చేసుకోవచ్చు. దీనిలో ప్రొబయెటిక్స్, బతికున్న బ్యాక్టీరియా ఉండి పేగు ఆరోగ్యాన్ని బాగుచేస్తాయి.

వైద్యులు మాత్రం పులియబెట్టిన పదార్థాలను ఉదయం లేదంటే మధ్యాహ్నం మాత్రమే తినాలి. రాత్రి వేళ తింటే డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. పులిసిన ఆహారం తినడంవల్ల కడుపులో వేడి పెరుగుతుంది. దీనివల్ల రాత్రిపూట నిద్రకు భంగం కలుగుతుంది. మరికొందరికి కడుపులో అనీజీగా ఉండటంతోపాటు బ్లోటింగ్ సమస్యలు వస్తాయి. నిద్రించే సమయానికి ముందు ఈ తరహా ఆహార పదార్థాలను తినకూడదని చెబుతున్నారు.
పులిసిన ఆహారాలు అందరికీ పడకపోవచ్చు. కొంతమందికి రియాక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. పులిసినవాటిల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. పులిసిన పదార్థాలు తిన్నవెంటనే కడుపునొప్పి వస్తే వాటిగురించి ఆలోచించాలి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications