బీపీ బాధితులకు బిగ్ రిలీఫ్, ఇక రోజూ మాత్రలు అవసరం లేదు- ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు..!!

అధిక రక్తపోటు ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. అధిక రక్తపోటు కారణంగా గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్ తో పాటుగా అనేక ప్రాంణాంతక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అధిక రక్త పోటు ఉన్నవారికి చికిత్స.. నిరంతరం మందులు అవసరం. వైద్యుల సూచన మేరకు మందులను క్రమం తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. అయితే, జీవనశైలిలో కొన్ని మార్పులతోనూ బీపీ నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాగా.. ఇప్పుడు మందు మందులు నిరంతరం వాడే వారి కోసం ఏడాదికి రెండు ఇంజెక్షన్లతో బీపీ నియంత్రించే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

అధిక రక్తపోటు ఉన్నవారికి నిరంతరం బీపీ చెక్ చేసుకోవటం అవసరం. బీపీ స్థాయిలకు గుర్తించి అందుకు అనుగుణంగా వైద్యులు వారికి మందులు సూచిస్తారు. అదే సమయంలో జీవనశైలిలో నూ మార్పులు అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి బీపీని కంట్రోల్ చేసుకోవడానికి సహక రిస్తుంది.

injection-twice-a-year-to-treat-high-blood-pressure-according-to-a-new-review-in-the-lancet-here-th

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లు పుష్క లంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ తగ్గాలంటే ఉప్పు వాడకం తగ్గించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ సోడియం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడా నికి ధ్యానం, యోగా లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి. అదే సమయంలో వైద్యులు సూచించిన విధంగా నిరంతరం మందులు క్రమం తప్పకుండా వాడాలి.

ఇక ఏడాదికి రెండు ఇంజెక్షన్లతో నియంత్రణ

అయితే, లాన్సెట్ తాజా అధ్యయనాల మేరకు రక్తపోటు నియంత్రణకు ఇక రోజూ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం తప్పే అవకాశం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చేయించుకుంటే చాలు. పూర్తిగా బీపీ నియంత్రణలోకి వస్తుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. ఈ దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ 'లాన్సెట్‌' వెల్లడించింది.

లాన్సెట్ వెల్లడించిన వివరాల మేరకు అమెరికాకు చెందిన రోష్‌ అండ్‌ అల్నైలమ్‌ ఫార్మాస్యూటికల్స్‌.. ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో జిలెబెసిరన్‌ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉంది. ఇది బీపీకి ప్రధాన కారణమైన, కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే యాంజియోటెన్సినోజెన్‌ అనే ప్రొటీన్‌కు అడ్డుకట్ట వేస్తుంది. ఒక ఇంజెక్షన్‌ చేస్తే 6 నెలల పాటు సమర్థంగా పనిచేసినట్టు పరిశోధనల్లో గుర్తించారు. దీంతో.. త్వరలోనే రెండు ఇంజెక్షన్ల ద్వారా బీపీని నియంత్రణలోకి తీసుకొచ్చే వెసులుబాటు కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+