పరగడుపున నిమ్మరసం తేనె తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..!!

నిమ్మరసంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడానికి ఇష్టపడతారు. ఉద‌యం ప‌ర‌గ‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కాస్త నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగటం వలన ‌రీర మెట‌బాలిజం పెరిగి కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. కానీ నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగే వారికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎన్ని సార్లు తాగాలి.. ఎంత మోతాదులో తాగాలి వంటి విషయాలతో ఎవరికి ఇది సమస్యగా మారుతుందనేది స్పష్టత ఇస్తున్నారు.

గోరు వెచ్చని నీటిలో నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బ‌రువును త‌గ్గించ‌డం కోసం ఈ నీళ్లు ఎంత‌గానో ప‌నిచేస్తాయి. అయితే కొంద‌రు ఈ నీటిలో తేనెకు బ‌దులుగా చ‌క్కెర క‌లిపి తాగుతుంటారు. బరువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ నిమ్మ‌కాయ నీళ్ల‌లో చ‌క్కెర క‌ల‌ప‌కూడ‌దు. ఉప్పును కూడా క‌ల‌ప‌కూడ‌దు. ఎండ‌వ‌ల్ల మీ శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డితేనే అలాంటి సంద‌ర్భంలోనే నిమ్మ‌కాయ నీళ్ల‌లో ఉప్పు, చ‌క్కెర క‌లిపి తాగాలి. రోజుకు 1 లేదా 2 సార్లు తాగాల‌ని మాత్ర‌మే నియమం పెట్టుకోవాలి. అన్నే సార్లు తాగాలి. లేదంటే శ‌రీరంపై నెగెటివ్ ప్ర‌భావం ప‌డుతుంది. నిమ్మ‌కాయ నీళ్ల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగించే నీళ్లు చాలా శుభ్రంగా ఉండాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయ నీరు తాగడం ద్వారా శరీర హైడ్రేషన్ బాగా ఉంటుంది. పరగడుపున తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. ఇది రోజంతా తీసుకునే ఆహారాన్ని జీర్ణ చేయడంలో సహాయపడుతుంది.

lemon-water-every-morning-encourages-your-immune-system-to-function-optimally-keeping-diseases-away

ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు

ఇలా రోజూ నిమ్మకాయం నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగటంతో పాటు శరీరం హైడ్రేటెడ్ అవుతుంది. బరువు కూడా తగ్గడానికి అది సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిమ్మ‌కాయ ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పి కొంద‌రు నేరుగా నిమ్మ‌ర‌సాన్ని సేవిస్తుూ ఉంటారు. ఇలా చేయటం సరైన విధానం కాదు. నిమ్మ‌కాయ ర‌సంలో ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇవి దంతాల‌కు నేరుగా తాకితే దంతాల‌పై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది. దీంతో దంతాలు బ‌ల‌హీనంగా మారుతాయి. గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య ఉన్న‌వారు ఈ నీళ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌ర‌గ‌డుపున సేవించ‌కూడ‌దు. ఈ నీళ్ల‌ను తాగాల‌ని భావిస్తే ఉద‌యం అల్పాహారం చేసిన త‌రువాత 40 నిమిషాలు ఆగి ఆ త‌రువాత తాగ‌వ‌చ్చు. ఆహారం తింటానికి ముందు లేదా తిన్న వెంట‌నే కూడా ఈ నీళ్ల‌ను సేవించ‌కూడ‌దు. లేదంటే మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకోలేదు. ఇలా నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగే విష‌యంలో ప‌లు సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఈ నీళ్ల‌తో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+