ఏ వయస్సు వారు ఎంత సేపు వాకింగ్ చేయాలి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

వాకింగ్. ఆరోగ్యాన్ని పెంచుతుంది. వయసుతో సంబంధం లేదు. రోజు వాకింగ్ దినచర్యలో భాగం చేసుకుంటే మంచింది. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డి బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారికి వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు, స్ట్రోక్స్ రాకుండా చూసుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం నియంత్ర‌ణ‌లో ఉంటాయి. వాకింగ్ వ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. అయితే, వాకింగ్ చేసే వారు తమ వయసుకు అనుగుణంగా ఎంత సేపు చేయాలో నిపుణులు సూచిస్తున్నారు. పరిమితి మించితే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

వాకింగ్ నిత్యం చేయటం ద్వారా ఆరోగ్యకరం. శారీర‌క దృఢ‌త్వం ల‌భిస్తుంది. వాకింగ్ వ‌ల్ల మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న, డిప్రెష‌న్ త‌గ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డి బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారికి వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు, స్ట్రోక్స్ రాకుండా చూసుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం నియంత్ర‌ణ‌లో ఉంటాయి. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను ఎల్ల‌ప్పుడూ నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. అయితే, రోజూ ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాల‌ని చాలా మందికి సందేహం. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్‌, అమెరిక‌న్ డ‌యాబెటిస్ అసోసియేష‌న్ చెబుతున్న ప్ర‌కారం ప్ర‌తి మనిషికి వారానికి క‌నీసం 150 నిమిషాల వ్యాయామం అవ‌స‌రం.

maintaining-a-regular-walking-routine-offers-health-benefits-for-all-age-groups

ఈ లెక్కల ప్రకారం వారంలో క‌నీసం 5 రోజుల పాటు రోజుకు 30 నిమిషాల పాటు అయినా స‌రే వ్యాయామం చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. వారంలో అలా 5 రోజుల పాటు చేస్తే చాలు. అయితే స‌మ‌యం ఉంద‌ని భావించే వారు రోజుకు క‌నీసం 60 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఇంకా ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.ఇక వాకింగ్‌ను మొద‌లు పెట్టేవారు ముందుగా రోజుకు 10 నిమిషాల‌పాటు వాకింగ్ చేయాలి. శ‌రీరం అల‌వాటు ప‌డే కొద్దీ స‌మ‌యాన్ని పెంచుతూ పోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుంటే రోజుకు 60 నిమిషాల పాటు వాకింగ్‌ను చాలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు. సాధార‌ణ వేగంతో వాకింగ్ చేస్తే గంట‌కు సుమారుగా 150 క్యాల‌రీల వ‌ర‌కు ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. ఉద‌యం ఖాళీ క‌డుపుతో వాకింగ్ చేస్తే ఇంకా ఎక్కువ క్యాల‌రీలను ఖ‌ర్చు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ విధంగా రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+