తమిళనాడు ఫేమస్ "ఖుష్బూ ఇడ్లీ".. ఇలా చేయండి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..!

సాధారణంగా ఇడ్లీ టిఫిన్ ను చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా పెద్దలు ఈ టిఫిన్ ను ఇష్టంగా తింటారు. ఆయిల్ లేకుండా చేయడంతోపాటు త్వరగా జీర్ణం అవుతుందని ఇడ్లీ తింటుంటారు. మరికొందరు ఆయిల్ ఫుడ్ ఇష్టం లేని వారు కూడా ఇడ్లీని బెస్ట్ ఆప్షన్ గా తీసుకుంటారు. ఇంకా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారికి వైద్యులు మొదటగా సూచించే టిఫిన్ ఇడ్లీనే. అయితే ఎప్పుడూ రొటీన్ గా ఇడ్లీని తిని బోర్ కొట్టిందా.. అయితే తమిళనాడు ఫేమస్ "ఖుష్బూ ఇడ్లీ" ని ఓసారి ట్రై చేయండి..

తమిళనాడులో హీరోయిన్ ఖుష్బూకు ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ ఏకంగా ఆమె కోసం గుడి కూడా కట్టేశారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే, తమిళనాడులో నటి ఖుష్బూతో పాటు ఖుష్బూ ఇడ్లీ కూడా అంతే ఫేమస్ అని చెబుతుంటారు. మెత్తగా, తెల్లగా ఉండే ఈ ఇడ్లీని సాంబార్ తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. మనం ఇంట్లో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా వెరైటీగా ఖుష్బూ ఇడ్లీ ట్రై చేసేయండి. అందులోకి కావాల్సిన పదార్థాలపై ఓ లుక్కేయండి..

అర కప్పు మినపప్పు, రెండు కప్పుల ఇడ్లీ బియ్యం, పావు కప్పు సగ్గుబియ్యం, రుచికి సరిపడా ఉప్పుతో ఈ ఇడ్లీ చేసుకోవచ్చు. తయారీ విధానం చూస్తే.. ముందుగా బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, సగ్గుబియ్యం కూడా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి 8 గంటల పాటు నానబెట్టాలి.

Mastering Tamil Nadu s Famous Khushboo Idli A Step-by-Step Guide

ఆ తర్వాత వీటిలోని నీటిని తీసేయాలి. తాజా నీటితో కడిగి మిక్సీలో వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి. ఆ తర్వాతి రోజు మూత తీసి ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. టేస్టీ ఖుష్బూ ఇడ్లీ రెడీ అయిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+