రోజూ కోడిగుడ్డు తింటున్నారా...అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
కోడిగుడ్లలో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కండరా ను బలంగా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. ఇంకా దెబ్బతిన్న కణజాలాలను సరి చేస్తాయని నిపు లు చెబుతున్నారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాగా, కోడిగుడ్లు తినటం పైన కొందరిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అసలు రెగ్యలర్ గా తినచ్చా.. ఎన్ని తినాలి.. ఏ సమయంలో తినాలి అనే సందేహాల పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
కోడిగుడ్లు శరీరానికి అనేక రకాలుగా ప్రయోజనాలు అందిస్తాయి. అదే సమయంలో కొందరికి సమస్యలకు కారణం అవుతాయి. సాధారణంగా హెల్దీగా ఉండేవారు రోజుకు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినడం మంచిదేనని నిపుణుల సచన. అదే విధంగా కొందరిలో డైలీ ఎగ్‌ను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె ఆరోగ్యానికి గుడ్లు మేలు చేసేవే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోకుండి పరిమితంగా ఆహారంగా మార్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. కోడిగుడ్డు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కోడిగుడ్డులో దాదాపు 180 నుండి 300 మిల్లీ గ్రాముల కొలె ట్రాల్ ఉంటుంది. ఇది అంతా కూడా పచ్చసొనలోనే ఉంటుంది. గుడ్డు తెల్లసొనలో కొలెస్ట్రాల్ ఉండదు. గుడ్డు గుండె ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొందరికి సమస్యలు వస్తాయి. దీంతో గుండె సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యడి సలహా మేరకే కోడిగుడ్డు వినియోగించటం మంచింది.

ఇక ఈ గుడ్లను చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్, శుద్ది చేసిన పిండి వంటి వాటితో కలిపి కేక్స్, కుకీస్ వంటి ఆహారాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. దీంతో ఈ క్యాలరీల రేటు మరింత పెరిగి ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. దీంతో, గుండెకు మేలు జరగడం పోయి గుండె జబ్బులు, అధిక బరువు, మధుమేహం, శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు పెరగడం వంటి సమస్య ను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక గుడ్లను తగిన మోతాదులో తీసుకోవడం కూడా చాలా అవసరం. కాగా.. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ చెబుతున్న ప్రకారం మనం రోజుకు 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాలను తీసుకోవచ్చు. ఒక గుడ్డులో దాదాపు 180 నుండి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక మనం వారానికి 3 నుండి 4 గుడ్లను తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న వారు వారానికి 3 గుడ్లను తీసుకోవచ్చని.. సమస్యలు కనిపిస్తే మాత్రం వైద్యుల సలహ మేరకు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications