ఈ సూప్ తీసుకోండి చాలు.. !!
పుట్టగొడుగులు కొందరికి చాలా ఇష్టం. మరికొందరు వాటికి దూరంగా ఉంటారు. మారుతున్న జీవనశైలి నేపథ్యంలో రుచితో పాటు శరీరానికి పూర్తి పోషణను అందించే ఆహారాలను ఎంచుకోవడం ముఖ్యం. అలాంటి వాటిలో పుట్టగొడుగులు ఒకటి. ఇది రుచికరమైనవి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకారి. పోషకాలతో నిండిన పుట్టగొడుగులను రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో ఎలాంటి సకారాత్మక మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
వైరల్ ఇన్‌ఫెక్షన్లు, ఇతర వ్యాధుల బారి నుండి రక్షించడానికి పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిలోని సమ్మేళనాలు శరీర సహజ రక్షణ వ్యవస్థలకు మద్దతు ఇస్తాయి.

కణాల పనితీరును మెరుగుపర్చే సామర్థ్యం పుట్టగొడుగులకు ఉంటుంది. దీనికి ఉండే గుణాలు క్యాన్సర్ కారకాలను నిర్మూలించగలవు. పుట్టగొడుగులు మెదడు ఆరోగ్యానికి కూడా విశేష ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలోని పోషకాలు ప్రారంభంలో ఉండే జ్ఞాపకశక్తి లోపాలను తగ్గించగలవు. అలాగే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నుండి మెదడును రక్షించడంలో తోడ్పడతాయి.
పుట్టగొడుగులను లిక్విడ్ రూపంలో అంటే సూప్ లా తరచూ తీసుకుంటోండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే పోషకాలు రక్తంలో కలిసిపోతాయి. రక్తనాళాలలో ప్లేక్ పేరుకుపోకుండా నిరోధిస్తాయి. కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇవి సహాయపడతాయి, తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. పేగుల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారికి పుట్టగొడుగులు ఒక వరం లాంటివి అని చెప్పుకోవచ్చు. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఊబకాయం నుండి ఉపశమనం పొందవచ్చు. వీటిలో ఉండే ప్రత్యేక పదార్థాలు శరీరంలోని మైక్రోబయోమ్‌ను (మంచి బ్యాక్టీరియా) సమతుల్యం చేసి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
ఉడికించిన అన్నంలో ఆలివ్ ఆయిల్, నిమ్మ తొక్క, హెర్బ్స్‌తో పాటు పుట్టగొడుగులు కలిపి తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉల్లిపాయలు, క్యారెట్లు, వెజిటబుల్ స్టాక్‌తో పుట్టగొడుగులను ఉడికించండం ద్వారా వచ్చే సూప్ ను రోజూ తీసుకోవడం అత్యుత్తమం.
Disclaimer: ఈ కంటెంట్ పుట్టగొడుగుల ప్రయోజనాలను తెలియజేయడానికి ఉద్దేశించినది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి డైటీషియన్లను సంప్రదించవచ్చు.
-
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications