రోజూ ఈ నట్స్ తినండి - బీపీ, కొవ్వు సమస్యలకు చెక్.. గుండె సేఫ్..!!

నట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆహారంలో నట్స్ చేర్చటం ద్వారా ఎన్నో సమస్యలకు ఫలితాల ను అందిస్తాయి. నట్స్ రెగ్యులర్ గా తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలను నియంత్రణకు మేలు చేస్తాయి. చూడటానికి చాలా చిన్నవిగా కనిపించినా పోషకాల విషయంలో మాత్రం ఈ విత్తనాలు సూపర్‌ ఫుడ్స్‌ అనిపించుకున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండే ఈ గింజలను రోజుకు ఒకటి-రెండు చెంచాలు తీసుకుంటే మీ శరీరానికి అవసరమైన శక్తి లభించడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

నట్స్ వినియోగం ఈ మధ్య కాలంలో పెరిగింది. శరీరానికి కావాల్సిన శక్తితో పాటుగా అనేక రకాల విటమిన్లు సైతం శరీరానికి అందుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన మందులు, జిమ్‌ వర్కవుట్లు మాత్రమే సరిపోవు. ఈ నట్స్ ద్వారానూ ప్రయోజనం దక్కుతుంది. మహిళల్లో అనేక మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. వారి సమస్యకు హలీమ్‌ గింజలు అద్భుతమైన పరిష్కారం గా నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఐరన్‌, ఫోలెట్‌ పుషలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచి, అలసటను తగ్గిస్తాయి. హలీమ్‌ గింజలు రక్తహీనతతో బాధపడేవారికి సంజీవని లాంటివి. వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, యాంటి ఆక్సిడెంట్స్‌ ఎముకల బలానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. అదే విధంగా గుమ్మడి గింజలను చాలామంది కేవలం రుచి కోసమే తింటారు. కానీ, వీటిలో జింక్‌, మెగ్నీషియం, ఫైబర్‌, విటమిన్‌-ఇ మెండుగా ఉంటాయి.

 రోజుకు ఎంత వంట నూనె వాడాలి, ఏది మంచిది- పరిమితి మించితే..!!
రోజుకు ఎంత వంట నూనె వాడాలి, ఏది మంచిది- పరిమితి మించితే..!!
nuts-may-lower-your-risk-of-heart-disease-and-your-levels-of-cholesterol-and-triglycerides

నట్స్ రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు

గుమ్మడి గింజలు పురుషులలో శుక్ర కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలోనూ, కండరాలకు శక్తినివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునే వారికి ఇవి సరైన ఎంపిక. అదే విధంగా శాకాహారులకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభించే అత్యుత్తమ వనరు అవిసె గింజలు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్‌ స్థాయులను అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమతు ల్యత కు ఎంతో మేలు చేస్తాయి. అయితే, అవిసె గింజలపై పొర చాలా గట్టిగా ఉంటుంది, అది త్వరగా జీర్ణం కాదు. అందుకే వీటిని పొడి చేసి తీసుకుంటేనే శరీరానికి పూర్తి పోషకాలు అందు తాయి. ఈ మూడు రకాల గింజలను కలిపి రోజుకు ఒకటి నుంచి రెండు చెంచాలు స్మూతీస్‌, సలాడ్స్‌ లేదా పెరుగులో కలుపుకొని తీసుకోవచ్చు. ఈ నట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా మంచి ప్రయోజనాలు అందుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+