ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా..!?
వాటర్ బాటిల్. ఎక్కడకు వెళ్లినా.. ఎక్కడ చూసినా నీళ్లు తాగాలంటే బాటిల్ ఉండాల్సిందే. బాటిల్ నీళ్లు తాగటం ఈ మధ్య కాలంగా బాగా అలవాటుగా మారిపోయింది. ఏ షాపులో చూసినా ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటి అమ్మకాలు కోట్లలో సాగుతున్నాయి. కాగా, అసలు ఈ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ లో నీరు తాగితే ఏం జరుగుతుందనే సందేహాలు ఉన్నాయి. వీటితో వచ్చే అనర్థాలు ఎక్కువే అని నిపుణులు చెబుతున్నారు.
ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ లో నీరు తాగటం పై కొద్ది రోజుల క్రితం కొలంబియా యూనివర్శిటీ, రట్‌గర్స్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో నివ్వెర పోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ నీళ్లు తాగటం ద్వారా డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకోవడమేనని తేల్చారు. వీటిల్లో నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్ర మైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో సులువుగా కలిసిపోతాయి. మన అవయవాలను, రోగనిరోధక శక్తిని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నానోప్లాస్టిక్ కణాలు మన పేగులు, ఊపిరి తిత్తుల ద్వారా నేరుగా రక్తంలో కలిసి పోతాయి. రక్తం ద్వారా గుండె, మెదడు తదితర అవయవాలకు చేరుకుంటాయి. కణాల్లోకి నేరుగా కూడా చొచ్చుకుపోతాయి.

నిపుణుల సూచనలు
ప్లాస్టిక్ బాటిళ్ల నుండి నీరు త్రాగినప్పుడు, అనుకోకుండా ఈ చిన్న కణాలను మనం మింగేస్తాము. అనేక అంతర్జాతీయ అధ్యయనాలు బాటిల్ వాటర్‌లో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నాయి. వాటి ఆరోగ్య ప్రభావాల గురించి తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుత్తుతున్నాయి. ప్లాస్టిక్‌లలోని కొన్ని రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, సంతానోత్పత్తి ప్రభావాలు, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వంటి హానిని కలిగిస్తాయి. దీంతో, సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో గాజు సీసాల్లోనూ నీరు అందుబాటులో ఉంచుతున్నారు. ప్లాస్టిక్ ను దూరం చేయటానికి వీటిని వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లల్లో నీర తాగటం ఆరోగ్య పరంగా ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.













Click it and Unblock the Notifications