Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎండాకాలం లో రాగి జావ..బార్లీ జావ- ఎవరికి ఏది మంచిది..!!

వేసవి మొదలైంది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్, కళ్లు తిరగడం, తలనొప్పి వంటి సమస్యలతో ఇబ్బందులు తప్పేలా లేవు. సరైన పోష్టికాహారం తీసుకోవటం ద్వారా ఎండల వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రాగి .. బార్లీ జావ తాగటం ఎండాకాలంలో ఎంతో మేలు చేస్తుంది. అయితే.. ఈ రెండు జావలు వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎవరికి ఏది మంచి చేస్తుందనేది నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

వేసవిలో ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవటం చాలా అవసరం. ఈ సమయంలో కొబ్బరి నీళ్లు, చెరుకు రసాలతో పాటుగా శరీరానికి బలం ఇస్తూ వేసవి నుంచి కాపాడే జావలు తీసుకోవటం మంచింది. అందులో రాగి జావ.. బార్లీ జావతో ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయి. రాగుల్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఏ,బీ,సీ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రాగుల్లో మినరల్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అందుకే వయసు పెరిగిన వారు.. చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి. రక్తహీనత నివారణకు, మధుమేహ నియంత్రణకు, బరువు తగ్గడానికి రాగులు సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ragi-naturally-cools-the-body-is-rich-in-calcium-barley-with-its-high-fibre-is-great-for-those-wi

వేసవిలో జావలతో ఆరోగ్య ప్రయోజనాలు

రాగుల్లో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు అధికంగా రాగి జావ తీసుకోకూడదు. అదే విధంగా బార్లీ జావ సైతం వేసవిలో మంచి ఔషధం గా పని చేస్తుంది. ఒక కప్పు బార్లీ గింజలను ముందుగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత తగినన్నీ నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. మజ్జిగ, ఉప్పు, జీకర్ర పొడి కలుపుకోవాలి. తాగేటప్పుడు నిమ్మరసం వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచి కావాలంటే దానిమ్మ గింజలను కూడా వేసుకోవచ్చు. బార్లీజావలో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే త్వరగా ఆకలి వేయదు. బరువును నియంత్రిస్తుంది. జలుబు వంటి సమస్య లను దూరం చేస్తుంది. అదే సమయంలో ఇప్పటికే పలు సమస్యలకు చికిత్స తీసుకుంటున్న వారు.. ప్రధానంగా మూత్రపిండాల సమస్యతో ఉన్న వారు మాత్రం వైద్యుడి సలహా మేరకు ఈ జావలను తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+