'రాగి ఆవిరి కుడుము'.. ఇలా చేస్తే ఉక్కు లాంటి బలం మీ సొంతం..!
రాగులతో ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రాగులతో జావ మాత్రమే కాదు.. వివిధ రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరు రాగులతో రాగిముద్దలు, ఇడ్లీ, దోసెలు, చపాతీల రూపంలో చేసుకుంటారు. అయితే మరికొందరు లడ్డూ, కేక్, హల్వా, పూరీ, పరోటా వంటివీ చేసుకుంటూ ఉంటారు. రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇక అధిక బరువుతో బాధపడే వారు రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రాగి ఆవిరి కుడుము తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణుల మాట.. మరి రాగి ఆవిరి కుడుము ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
రాగి ఆవిరి కుడుము తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. రాగి పిండి ఒక కప్పు, ఉప్పుడు బియ్యం (లేదా మామూలు బియ్యం) అర కప్పు, మినపప్పు 1/4 కప్పు, అలాగే ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు తగినన్ని తీసుకోవాలి.
ఇక రాగి ఆవిరి కుడుము తయారీ విధానం చూస్తే.. ముందుగా మినపప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. అలా 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన పప్పు, బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక కప్పు రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కనీసం 7 నుంచి 8 గంటల పాటు రాత్రంతా పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల కుడుములు సాఫ్ట్ గా వస్తాయి. ఇప్పుడు పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఆవిరి కుడుము పాత్రను లేదా ఇడ్లీ పాత్రను తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకోవాలి. ఇప్పుడు పాత్రలో పిండిని వేసి ఆవిరి మీద 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా కుడుము ఉడికిన తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి తీసుకోవాలి. అంతే రాగి ఆవిరి కుడుము రెడీ అయినట్టే.. ఇప్పుడు ఈ రాగి ఆవిరి కుడుమును వేడివేడిగా అల్లం చట్నీ లేదా వేరుశనగ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
-
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications