వీటిని మళ్లీ వేడి చేసి తింటున్నారా? రోగాలు వచ్చినట్లే!
వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక సీజనల్ వ్యాధి మనిషికి అంటుకుంటుంది. దీన్ని నివారించాలంటే వేడివేడిగా ఆహారాన్ని తీసుకోవడం ఒక్కటే మార్గం. అయితే కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత మళ్లీ బయటకు తీసి వేడిచేసి తింటుంటారు. కానీ కొన్ని పదార్థాలను వేడిచేయడంవల్ల విషంగా మారతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థాలు ఏవేంటనేది తెలుసుకుందాం.
చికెన్: చికెన్ పోషకాల నిలయం. ప్రొటీన్ బాగా దొరుకుతుంది. అయితే ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకొని తర్వాత పదే పదే వేడిచేసినప్పుడు అందులో ఉండే ప్రొటీన్ రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారుతుంది. ఒక్కోసారి విషంగా కూడా మారుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. జీర్ణం కాకుండా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు.

అన్నం: వండిన అన్నాన్ని ఒక్కసారి ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు. తర్వాతరోజు వేడిచేసుకొని తినొచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు, మరిన్ని సార్లు వేడిచేయడం మంచిది కాదు. బయట వాతావరణంలో ఉంచినప్పుడు హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది.
సీ ఫుడ్: చేపలు, రొయ్యలు తదితర సముద్ర ఆహారాన్ని తాజాగానే తీసుకోవాలి. నిల్వ ఉంచితే జిహ్వకు రుచించకపోవడంతోపాటు పోషకాలు కూడా తగ్గిపోతాయి. అతిగా వేడిచేసిన తిన్న సముద్ర ఆహారం కొందరిలో దురదను కలిగిస్తుంది. గుడ్డు తో చేసిన కూరలను అసలు వేడిచేయకూడదు. దానివల్ల వాటిల్లో ఉండే ప్రొటీన్స్ తగ్గిపోతాయి. ప్రొటీన్లు ఉన్న ఆహారంలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. అతిగా వేడిచేయడం వల్ల అది ఆక్సిడైజ్ అయి క్యాన్సర్‌కు దారితీస్తుంది.
పాలకూర పప్పు, పాలక్ పనీర్, పాలకూర పచ్చడి వేడిచేసిన కొద్దీ నైట్రోసమైన్స్‌గా మారి క్యాన్సర్‌కు దారితీస్తాయి. పుట్టగొడుగులను ఒక్కసారే వండుకొని తినాలి. పదే పదే వేడిచేయడం సరైన చర్య కాదు. వీటిని సరైన వాతావరణంలో నిల్వ చేయకపోతే తిన్న వెంటనే పొట్టలో గడబిడ మొదలవుతుంది. బీట్ రూట్.. ఇతర దుంప కూరలను ఎక్కువగా వేడిచేసి తినకూడదు.












Click it and Unblock the Notifications