రెస్టారెంట్ స్టైల్ రొయ్యల వేపుడు.. ఇలా చేస్తే ఎంజాయ్ చేస్తారు!
ప్రతిరోజు మనం తినే ఆహారం మన శరీరానికి పుష్టిని ఇచ్చేది మాత్రమే కాకుండా, మన నోటికి రుచికరంగా ఉండేలా కూడా చూసుకుంటాం. ఇక చాలామంది రొయ్యలను చాలా ఇష్టంగా తింటారు. రొయ్యలను కూర చేసుకోవడమే కాకుండా, క్రిస్పీగా ఉండేలా ఫ్రై చేసుకుని కూడా తింటుంటారు. రెస్టారెంట్ స్టైల్ లో క్రిస్పీ రొయ్యల ఫ్రై ఎలా చేయాలి? బాగా టేస్టీ గా ఉండేలా క్రిస్పీ రొయ్యల ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
రొయ్యలు పెద్దవి- 500 గ్రాములు శుభ్రం చేసుకుని పెట్టుకున్నవి
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు- రెండు సన్నగా తరిగినవి
పచ్చిమిర్చి- నాలుగు నుండి ఐదు చేసినవి
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూన్
టమాటా- ఒకటి సన్నగా తరిగినది
కారంపొడి- ఒకటిన్నర టేబుల్ స్పూన్
ధనియాల పొడి- ఒక స్పూన్
జీలకర్ర పొడి- ఒక స్పూన్
ఉప్పు- తగినంత
నిమ్మరసం- ఒక టీ స్పూన్
కొత్తిమీర- కొద్దిగా
కరివేపాకు- ఒక రెమ్మ

తయారీ విధానం
ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను కొద్దిగా ఉప్పు పసుపు, అర స్పూన్ కారం వేసి బాగా కలిపి 15 నుంచి 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత ఒక బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి మ్యారినేట్ చేసిన రొయ్యలను అందులో వేసి రొయ్యల లోని నీరంతా ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇలా చేస్తే రొయ్యల వేపుడు బాగా వస్తుంది
ఆపై అదే బాణలిలో మరికొంత నూనె వేసి కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో మిగిలిన కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మరియు తగినంత ఉప్పు వేసి కలపాలి. ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలను ఆ మసాలాలో వేసి తక్కువ మంటపై బాగా కలుపుతూ వేయించుకోవాలి.
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ
తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకొని, ఆపై కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. దీనిని అన్నంలో కానీ, చపాతి లోకి కానీ, లేదా స్టార్టర్ లా తిన్నా కూడా బాగుంటుంది.



Click it and Unblock the Notifications