ప్లాస్టిక్ నియంత్రణకు స్వీట్ ప్లాన్.. రెస్పాన్స్ అదుర్స్!

ప్లాస్టిక్ కవర్‌ల వాడకం తగ్గించాలని ప్రభుత్వాలు ఎన్నో సార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, ప్రజల్లో ప్లాస్టిక్ వాడే అలవాటు పూర్తిగా మారడం లేదు. చాలా చోట్ల ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్‌లు చెత్తలో పడేస్తున్నారు. ఇలా పడేసిన కవర్‌లను పశువులు తినేసి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోయే అవకాశం లేదు. ఫలితంగా మట్టి కూడా కలుషితం అవుతుంది .

ఈ సమస్యను దగ్గరగా గమనించిన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం దేవనగర్ గ్రామ సర్పంచ్ ఎండీ యూసుఫ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు.గాంధీ జయంతి సందర్భంగా వారు ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. గ్రామస్థులు ఎవరైనా కిలో ప్లాస్టిక్ కవర్‌లను సేకరించి గ్రామ పంచాయతీకి అప్పగిస్తే, వారికి కిలో చక్కెరను ఉచితంగా ఇస్తామని చెప్పారు.

Sweet Fight Against Plastic - Dichpally Village Offers Free Sugar for Plastic Covers collected by villagers

ఈ ప్రకటన విని మొదటి రోజే చాలా మంది గ్రామస్థులు ప్లాస్టిక్ కవర్‌లు తీసుకొచ్చి చక్కెర తీసుకున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంట్లో పేరుకుపోయిన పాత కవర్‌లు, దుకాణాల నుంచి వచ్చిన కవర్‌లు అన్నీ తీసుకొచ్చి అప్పగించారు.సర్పంచ్ ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ కవర్‌లు చెత్తలో పడకుండా నియంత్రించాలని, సేకరించిన కవర్‌లను రీసైక్లింగ్ యూనిట్లకు పంపిస్తామని చెప్పారు. ఈ పథకం కోసం కావాల్సిన ఖర్చులో సగం తానే భరిస్తానని కూడా హామీ ఇచ్చారు.

ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కేవలం పర్యావరణం దెబ్బతినడమే కాదు, పశువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. అనేక గ్రామాల్లో పశువులు ప్లాస్టిక్ తిని చనిపోయిన సంఘటనలు వినిపిస్తూనే ఉన్నాయి. దేవనగర్ గ్రామం ఇలాంటి సమస్యను ముందుగానే గుర్తించి, ప్రజలను ప్రోత్సహించే విధంగా ఈ 'తియ్యటి' పోరాటాన్ని ప్రారంభించింది. చక్కెర ఇస్తున్నందున ప్రజలు ఆసక్తితో పాల్గొంటున్నారు.

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ భూములన్నీ పేదలకు పంచే ఆలోచన!
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ భూములన్నీ పేదలకు పంచే ఆలోచన!

ఇది కేవలం ఒక రోజు కార్యక్రమం కాకుండా కొనసాగిస్తే మంచి ఫలితాలు వస్తాయని గ్రామస్థులు భావిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు గ్రామ స్థాయిలో పెరిగితే ప్లాస్టిక్ కాలుష్యం బాగా తగ్గుతుంది. ప్రభుత్వాలు చేసే అవగాహన కార్యక్రమాలకు అదనంగా ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటే ప్రజలు మరింతగా సహకారం అందిస్తారు. దేవనగర్ గ్రామం చూపిన ఈ మార్గం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+