టీ20 ఫైనల్ లో పాకిస్తాన్ కు టీమిండియా సేమ్ ట్రీట్‌మెంట్..

జపాన్ ఐచి- నగోయాలో కొనసాగుతున్న ఆసియా గేమ్స్ లో భాగంగా దాయాదుల ఫైనల్ మ్యాచ్ ఆరంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం సరిగ్గా 9:30 గంటలకు టాస్ పడింది. టాస్ గెలిచిన టీమిండియా కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ పై ఈ మ్యాచ్ లో ఛేజింగ్ కే ప్రాధాన్యత ఇచ్చాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. వంటి స్టార్ ప్లేయర్లు తుదిజట్టులో ఉండటంతో టీమిండియా భారీ స్కోర్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

జపాన్‌ నిస్సిన్ సిటీలో గల కొరోగీ అథ్లెటిక్ పార్క్ స్టేడియం.. ఈ మ్యాచ్ కు వేదిక. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా వరుసగా రెండోసారి స్వర్ణం సాధించాలని పట్టుదలగా ఉండగా, పాకిస్థాన్ తొలిసారి పసిడి పతకాన్ని ముద్దాడాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. దేశానికి డబుల్ ధమాకా లభిస్తుంది. ఇప్పటికే ఫైనల్ లో శ్రీలంకను ఓడించి భారత మహిళల జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

India Captain Shreya Iyer have refused handshakes with Pakistan after win the toss in Final in Japan

టాస్ గెలిచిన అనంతరం రెండు జట్ల కేప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. దీన్ని ఎప్పట్లాగే పక్కన పెట్టింది టీమిండియా. పాకిస్తాన్ కేప్టెన్ సాహెబ్జాదా ఫర్హాన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి శ్రేయాస్ అయ్యర్ నిరాకరించాడు. టాస్ గెలిచిన వెంటనే కామెంటేటర్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భారత్ నిరాకరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.

ఈ టోర్నమెంట్ లో భారత్, పాకిస్థాన్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌ వర్షార్పణం కావడంతో మెరుగైన సీడింగ్ ర్యాంకింగ్స్ ఆధారంగా సెమీఫైనల్స్ చేరాయి. సెమీస్‌లో టీమిండియా 124 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. పాకిస్తాన్. ఈ రెండు జట్లు కూడా టీ20 ఇంటర్నేషనల్స్ లో ఇప్పటివరకు 17 సార్లు తలపడ్డాయి. వీటిల్లో మెజారిటీ మ్యాచ్ లు భారత్ వే. టీమిండియా 13 సార్లు విజయం సాధించగా, పాకిస్తాన్ మూడింట్లో మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్ టై అయింది.

భారత్ తుది జట్టులో.. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ ప్రీత్ బుమ్రా ఉన్నారు.

పాకిస్తాన్ ప్లేయింగ్ 11లో.. సాహెబ్జాదా ఫర్హాన్ (కేప్టెన్), మాజ్ సదాకత్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), సయీమ్ అయూబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, సాద్ మసూద్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ మోకిమ్ కు అవకాశం లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+