మండే ఎండలు.. వీటితో వేడిని తరిమి కొట్టండి
మెంతి టీ: అధిక రక్తపోటును, చక్కెరను నియంత్రిస్తుంది. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. దీన్ని టీగా కూడా తీసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా అయితే ఏప్రిల్, మే నెలల్లో వేడి ఉండేది. మండే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. వేసవిలో మనం తీసుకునే పానీయాలు మన దాహార్తిని తీర్చడమే కాకుండా శరీరంలో వేడిని నియంత్రిస్తాయి. అలాగే మనల్ని చల్లబరుస్తాయి.

మెంతి టీ:
అధిక రక్తపోటును, చక్కెరను నియంత్రిస్తుంది. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెంచడంతోపాటు దీన్ని టీగా కూడా తీసుకోవచ్చు. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపిస్తుంది. గ్యాస్, స్టొమక్ యాసిడ్ వంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జీలకర్ర నీరు:
జీలకర్ర మన అంతర్గత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీలకర్ర నానబెట్టిన నీరు లేదా రెండు చిటికెల జీలకర్ర వేసి మరిగించిన నీరు త్రాగాలి. శరీరానికి చల్లదనంతోపాటు జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది.

చెరకు రసం:
దీనిలో ఐస్ కలపకుండా తాగాలి. చెరుకు రసం స్టాల్స్ లో చెరకు, అల్లం, నిమ్మకాయలను కలిపి మెత్తగా రుబ్బి పుదీనా కలుపుతారు. సహజమైన తియ్యదనంతపాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

మజ్జిగ:
వేసవి కాలంలో మజ్జిగ పానీయంగా లేదా ఆహారంగా తీసుకోవడం తప్పనిసరి. ఇది మన శరీరాన్ని చల్లబరచడంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకాన్ని నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం మేలు.

పుచ్చకాయ:
ఎండాకాలంలో వేడిని తరిమికొట్టే మరో ముఖ్యమైంది పుచ్చకాయ. రోడ్డుపక్కన ఉండే స్టాల్స్ లో పుచ్చకాయను ముక్కలుగా కోసి చూడగానే వేసవిలో రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్‌లో ఏర్పాటు చేసే మరో ముఖ్యమైన స్టాల్ ఇది. దీంట్లో అనేక పోషకాలున్నాయి.

కొబ్బరి నీరు:
ఇది మన సాంప్రదాయ ఆహారంలో భాగం. ఉదయాన్నే మంచినీళ్లు తాగడం వల్ల రోజంతా చల్లగా ఎలా ఉంటుందో.. మధ్యాహ్న సమయంలో కొబ్బరినీరు తాగితే శరీరానికి అంత ఉల్లాసం లభిస్తుంది












Click it and Unblock the Notifications