LPG cylinder news: మళ్లీ యుద్ధం.. గ్యాస్ సిలిండర్ వినియోగంపై బిగ్ అలెర్ట్..!

ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హార్మూజ్ లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో అమెరికా కూడా భారీ స్థాయిలో ప్రతి దాడులు చేపట్టింది. తాజా పరిణామాల మధ్య హార్మూజ్ జలసంధిలో రాకపోకలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

ఈ పరిస్థితుల మధ్య ఇరాన్- అమెరికా మధ్య మరోసారి పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో గ్యాస్ సిలిడర్ల కొరత మరోసారి రానున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై దేశంలోని అనేక కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్- అమెరికా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం ప్రారంభమైతే హార్మూజ్ జలసంధి మూతపడి మరోసారి దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత రావచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే నిపుణులు మాత్రం.. తక్షణమే ఈ ప్రభావం సాధారణ కుటుంబాలపై ఏమీ ఉండదని చెబుతున్నాయి. జూలై 10 నాటికి దేశవ్యాప్తంగా LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తున్నాయి. ఇక భారత్ LPG వినియోగంలో హార్మూజ్ జలసంధి నుంచే దాదాపు 60 శాతం సరఫరా అవుతుంది. అయితే తాజాగా అక్కడి పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా మారిన తరుణంలో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. మరోవైపు చమురు దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని భారత రిఫైనరీ కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా తగ్గిస్తూ వస్తున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్ కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉంది. అలాగే సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెస్ట్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి కూడా భారత్ కు పెద్ద మొత్తంలో చమురు దిగుమతి అవుతోంది. ఈ క్రమంలో భారత్ కు తక్షణమే గ్యాస్ కొరత రాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

LPG cylinder Warlike situation in West Asia again Will there be an LPG cylinder shortage in India

ఇక ప్రస్తుతం ఎల్పీజీ రేట్ల వివరాలు చూస్తే 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో ప్రస్తుతం రూ.942 గా ఉంది. అలాగే కోల్ కతాలో రూ. 968 గా ఉంది. ఇక చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 957 గా ఉంది. జైపూర్ లో రూ. 945.50 గా ఉంది. అలాగే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,390 గా ఉంది. కోల్ కతాలో రూ. 3,081 గా ఉంది. ఇక జైపూర్ లో రూ. 2,957 గా ఉంది. ప్రస్తుతానికి అయితే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+