పెళ్లయిన నాలుగు రోజులకే నవ వధువు జంప్.. పోతూ పోతూ..
హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి జరిగిన నాలుగు రోజులకే ఓ నవ వధువు ఆ ఇంట్లోని బంగారం, డబ్బుతో పరార్ అయింది. వరుడి కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను బట్టి యువతి సుమారు రూ.16 లక్షల విలువైన ఆభరణాలు, రూ.1.80 లక్షల నగదు తీసుకెళ్లినట్లు స్పష్టం అవుతోంది. బిలాస్ పూ ర్ జిల్లా భరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన వైరల్ అవుతోంది.
ఏం జరిగింది..?
వరుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని యమునా నగర్ కు చెందిన 22 ఏళ్ల యువతిని ఆ గ్రామానికి చెందిన యువకుడు అక్టోబర్ 31 న హరియాణాలోని జగధారి కోర్టులో వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత వధువు అత్తవారింటికి వెళ్లింది. నాలుగైదు రోజులపాటు వినయంగా ఉంటూ అత్తింటివారిని నమ్మించింది. నవ దంపతులను చూసి ఆ కుటుంబమంతా సంతోషించింది. ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్లకారం ఆ నవ వధువు నవంబర్ 4న ఇంట్లో నుంచి సడెన్ గా కనిపించకుండా పోయింది. అలాగే ఇంట్లోని దాదాపు రూ. 16 లక్షల విలువైన బంగారం, రూ. 1.80 లక్షల నగదు కూడా కనిపించకుండా పోయింది.

యువతి కోసం కుటుంబ సభ్యులు గ్రామమంతా గాలించారు. అయినా ఆమె ఆచూకీని కనుగొనలేకపోయారు. దాంతో పోలీసులను ఆశ్రయించారు. వరుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భరారీ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. ఆ యువతి ఎక్కడికి వెళ్లింది..? యువతి నిజంగానే ఆభరణాలు, నగదు తీసుకెళ్లిందా..? ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఈ ఘటనపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
