'రామాయణ' మూవీలో డిలీటెడ్ సీన్ వైరల్.. యాడ్ చేయాలంటున్న ఫ్యాన్స్

ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో వసూళ్లలో దూసుకెళ్తున్న మూవీ రామాయణ పార్ట్ 1.. దీపావళి కానుకగా నవంబర్ 5 న విడుదలైన ఈ మూవీ మూడు రోజుల్లోనే ఏకంగా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం చేస్తోంది. తొలి రోజు నుంచే నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సృష్టిస్తోంది. అటు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ అయిన బుక్ మై షో లో గంటకు దాదాపుగా 60 వేల టికెట్స్ బుకింగ్ అవుతున్నాయి. చూస్తుంటే రామాయణ మూవీ ప్రభంజనం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

అయితే రామాయణ మూవీకి సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ లోని ఓ కీలకమైన ఫైటింగ్ సీక్వెన్స్ ను చిత్ర యూనిట్ ఎడిటింగ్ లో తీసేసినట్లు సమాచారం. అయితే ఇంటర్నేషనల్ ప్రేక్షకుల కోసం ఆ సీన్ ను అలాగే ఉంచారట. ఇక ఇతర దేశాల్లో ఈ సీన్ చూసిన ఫ్యాన్స్ భారత్ వర్షన్ లోనూ ఈ సీన్ ను యాడ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారట. ఈ ఫైటింగ్ సీన్ అద్భుతంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్న క్రమంలో వీళ్లు ఓ వింత ఆకారాలు కలిగిన తోడేళ్ల లాంటి మృగాలతో ఫైట్ చేస్తారట. రాముడు, సీత, లక్ష్మణుడు వీరోచితంగా ఈ మృగాలతో ఫైట్ చేస్తారని సమాచారం. ఈ సీన్ ఇంటర్నేషనల్ ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంచారట. కానీ ఇండియన్ వర్షన్ లో మాత్రం తీసేశారు. అయితే ఈ సీన్ ను యాడ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

Ramayana movie news Deleted scene from the movie Ramayana goes viral fans demand its inclusion

ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటించారు. అలాగే సీతాదేవిగా సాయి పల్లవి నటించింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటించారు. అలాగే సన్నీ డియోల్ హనుమాన్ పాత్రలో మెప్పించారు. ఇక లక్ష్మణుడిగా రవి దూబే నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+