సీఎం రేవంత్ కు సందీప్ రెడ్డి వంగా బర్త్ డే విషెస్..యంగ్ లుక్ ఫొటోతో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తన 57వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో సీఎం రేవంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, రేవంత్ అభిమానులు పాల్గొన్నారు.
Wishing the Hon’ble Chief Minister of Telangana, Sri Revanth Reddy garu, a very HAPPY BIRTHDAY 🎂 & a HAPPY DEEPAVALI 🪔May you triumph over a million Narakasuras and stand tall with the courage, conviction and righteousness of Lord Rama.#HappyBirthdayRevanthReddy https://t.co/zdffNdDNhY
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 8, 2026
ఇక తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ చిన్ననాటి ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. యంగ్ ఏజ్ లో ఉన్న సీఎం ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఎం రేవంత్ మిలియన్ల నరకాసురులపై విజయం సాధించాలంటూ ఆకాంక్షించారు. ఆయన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.

" గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే దీపావళి శుభాకాంక్షలు. మీరు లక్షలాది నరకాసురులపై విజయం సాధించాలని.. శ్రీరాముడి ధైర్యం, దృఢ సంకల్పం, ధర్మంతో సగర్వంగా నిలబడాలని కోరుకుంటున్నాను.. అని సందీప్ రెడ్డి వంగా తన ప్రత్యేక పోస్టులో స్పష్టం చేశారు. అలాగే ఇటీవల వరంగల్ ఎయిర్ పోర్ట్ కు సందీప్ రెడ్డి వంగా రెండు పేర్లను సూచిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి వివరించిన సంగతి తెలిసిందే. వాటిల్లో రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటి కాగా మరొకటి కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇక సందీప్ రెడ్డి వంగా పోస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి దట్స్ ది స్పిరిట్ అని రిప్లై ఇవ్వడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
