ప్రొటీన్‌ లోపం సంకేతాలు, నిర్లక్ష్యం చేస్తే డేంజర్ - వీటిని తీసుకోండి..!!

ప్రొటీన్ అనేది శరీరానికి ఎంతో అవసరం. హార్మోన్లు, ఎంజైమ్‌లు, రోగనిరోధక కణాలు, రవాణా ప్రొటీన్ల ఉత్పత్తిలో ప్రొటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో మనం తగినంత ప్రొటీన్ తీసుకోనప్పుడు మన శరీరం వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రొటీన్ లోపం సంకేతాలను శరీరం ఎప్పటికి అప్పుడు ఇస్తుంది. అప్రమత్తం కాకుంటే ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ లోపం బారిన పడకుండా పలు సూచనలు అందిస్తున్నారు.

ప్రొటీన్ లోపం ఉన్నప్పుడు ముందుగా కండరాల బలహీనత మొదలవుతుంది. కండరాల బలం తగ్గి.. బలహీనత, అలసట, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది లాంటి సమస్యలు కలుగుతాయి. వ్యాయామం చేసినా కండరాలు పెరగకపోవడాన్ని, క్షీణించడాన్ని గమనించవచ్చు. అదే విధంగా రోగనిరోధక వ్యవస్థలోని కణాలు, ముఖ్యంగా యాంటీబాడీస్‌ ప్రొటీన్‌తో తయారు కావటంతో.. ప్రొటీన్ లోపం రోగనిరోధక శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దానివల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ తదితర వ్యాధులకు గురవుతుంది. జుట్టు ప్రధానంగా ప్రొటీన్ (కెరాటిన్) తో తయారవుతుంది. ప్రొటీన్ లోపంవల్ల జుట్టు సన్నబడటం, పొడిబారడం, బలహీనపడటం, విపరీతంగా రాలిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ప్రొటీన్‌ లోపం చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది. చర్మం పొడిగా, పొలుసులుగా మారుతుంది. అదేవిధంగా చర్మంపై పగుళ్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

signs-of-protein-deficiency-leads-to-many-problems-remedies-here

వీటితో పాటుగా చేతుల, కాళ్ల గోర్ల ఆరోగ్యానికి కూడా ప్రొటీన్‌ దోహదపడుతుంది. ప్రొటీన్‌ లోపంవల్ల గోర్లు పెలుసుగా మారడం, సులభంగా విరిగిపోవడం, గోర్లపై గీతలు ఏర్పడటం లాంటి సమస్యలు వస్తాయి. ఎడీమా శరీరంలో ద్రవ సమతుల్యత లోపంవల్ల వస్తుంది. ప్రొటీన్‌లు రక్తంలో ప్లాస్మా ఆంకోటిక్ పీడనాన్ని నిర్వహించడంలో సాయపడతాయి. ఈ పీడనం రక్తనాళాల నుంచి కణ జాలంలోకి ద్రవం లీక్ అవ్వకుండా నిరోధిస్తుంది. ప్రోటీన్ లోపంవల్ల ఈ పీడనం తగ్గుతుంది. ప్రొటీన్ ఎముకల ఆరోగ్యంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ప్రొటీన్ లోపంవల్ల రక్తహీనత ఏర్పడి తీవ్రమైన అలసట, బలహీనత, తల తిరగడం లాంటి సమస్యలు సంభవిస్తాయి. ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తికి ప్రతి కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, పప్పులు, బీన్స్, చిక్కుళ్ళు, కాయధాన్యాలు, గింజలు లాంటి వాటిలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+