ఒకరోజు ఓ గంట నిద్ర తగ్గితే, ఏం జరుగుతుంది..!!

నిద్ర కేవలం విశ్రాంతి కాదు. ఆరోగ్యానికి ఎంతో అవరం. చాలా మంది కంటి నిండా నిద్ర పోలేక పోతున్నారు. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మానిసిక ఒత్తిడి.. పని భారం వంటి కారణాలతో నిద్రకు దూరం అవుతున్నారు.అయితే కేవలం ఒక గంట నిద్ర తక్కువైనా దాని ప్రభావం మన శరీరంపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర తగ్గితే వెంటనే ఆరోగ్యం పైన ప్రభావం చూపకపోయినా.. దీర్ఘ కాలంలో మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు.

నిద్ర మనిషిలో మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి లాంటి అనేక శారీరక, మానసిక ప్రక్రియలకు అత్యవసరం. నిద్రపోయినప్పుడు మెదడులో రోజువారీ పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోయి కొత్త సమాచారం నిక్షిప్తం అవుతుంది. ఒక గంట నిద్ర తగ్గినా.. భవిష్యత్ పైన ప్రభావం చూపుతుంది. ఆ ఒక్క గంట నిద్రలోటును భర్తీ చేయడానికి కనీసం నాలుగు రోజుల వరకు సమయం పట్టవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి గంట నిద్ర తక్కువైతే మరుస టి రోజు అలసట, ఏకాగ్రత లోపం, చికాకు లాంటి లక్షణాలను అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. గాఢ నిద్ర కోసం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

sleep-is-as-important-for-good-health-as-diet-and-exercise

అదేవిధంగా మంచి నిద్ర కోసం పడకగది చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ మధ్యాహ్నం ఓ 20 నిమిషాలపాటు పవర్ నాప్ తీసుకోవడంవల్ల కూడా అలసట తగ్గి, రోజంతా చురుకుగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే పగలు ఎక్కువ సేపు నిద్రపోవడం, సాయంత్రం వేళల్లో కునుకు తీయడం మంచిది కాదు. సాయంత్రం వేళల్లో కెఫీన్, ఆల్కహాల్ తీసుకోవడం కూడా నిద్రకు భంగం కలిగిస్తుంది. రోజుకు ఆరు గంటలకు తగ్గకుండా, ఎనిమిది గంటలకు మించకుండా నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+