రాత్రి పూట ఈ ఆహారాలు పొరపాటు కూడా తీసుకోవద్దు,డేంజర్..!!

మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీంలోకి చేరే పోషకాలు ఆరోగ్యాన్ని పెంచుతాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు.. జీవనశైలి సమస్యలకు కారణం అవుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగా లైఫ్ గడిపే వారు ఆహారం విషయంలో కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రాత్రి పూట డ్యూటీలు చేసే వారు తమ ఆహారంలో కనీస జాగ్రత్తలు తీసుకోవటం లేదనే విషయం తాజా నివేదికల్లో తేలింది. అసలు రాత్రి పూట ఏ ఆహారం మంచిది.. ఏ ఆహారాలు తీసుకోకూడనేది నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

రాత్రి భోజ‌న విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది. రాత్రి భోజ‌నంలో కొన్ని ఆహారా ల‌ను నిషేధించాలి. రాత్రి సమయంలో కారంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల గుండెల్లో మంట‌, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. దీని వ‌ల్ల నిద్ర‌పోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. క‌నుక వీటికి బ‌దులు నిద్రించే ముందు హెర్బ‌ల్ టీ లేదా పెరుగన్నం వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిది. కాఫీ, టీ ల‌లో కెఫీన్ ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే కెఫీన్ శ‌రీరంలో గంట‌ల త‌ర‌బ‌డి ఉంటుంది. ఇది నిద్ర‌కు అంత‌రాయం క‌లిగిస్తుంది. మ‌ద్యం తీసుకోవ‌డం వ‌ల్ల మొద‌ట్లో నిద్రపోయిన‌ప్ప‌టికీ ఇది నిద్ర చ‌క్రానికి ఆటంకం క‌లిగిస్తుంది. క‌నుక నిద్రించే ముందు పండ్లు, కూర‌గాయ‌లు వంటి ఆహారాల‌ను తీసుకోవాలి. చ‌క్కెర క‌లిగిన ఆహారా ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని వ‌ల్ల శ‌క్తి త‌గ్గిపోతుంది. నిద్ర కు ముందు ఎక్కువ‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల క‌డుపులో అసౌక‌ర్యంగా ఉంటుంది. దీని వ‌ల్ల నిద్ర‌కు అంత‌రాయం క‌లుగుతుంది.

sri-venkateswara-swamy-at-tirumala-will-remain-closed-for-over-10-hours-on-march-03

జంక్ ఫుడ్ లో అనారోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వ‌వు. నిద్ర‌కు, జీర్ ణ‌క్రియ‌కు అంత‌రాయాన్ని క‌లిగిస్తాయి. క‌నుక పండ్లు, కూర‌గాయ‌లు, తృణ‌ధాన్యాలు వంటి ఆహా రాన్ని ఎంచుకోవ‌డం ఉత్త‌మం. కార్బోనేటెడ్ పానీయాలు క‌డుపు ఉబ్బ‌రానికి , అజీర్ణానికి కార‌ణం అ‌వుతాయి. దీని వ‌ల్ల నిద్ర‌కు భంగం క‌లుగుతుంది. వీటికి బ‌దులుగా నీటిని లేదా హెర్బ‌ల్ టీ ల‌ను తాగ‌డం మంచిది. అధిక ప్రోటీన్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ క‌ష్టంగా మారుతుంది. రాత్రి స‌మ‌యంలో అసౌక‌ర్యంగా ఉంటుంది. క‌నుక‌ రాత్రి భోజ‌నంలో లీన్ ప్రోటీన్ ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం మంచిది. రాత్రి నిద్రించే ముందు డార్క్ చాక్లెట్ ను తీసుకోకూడ‌దు. దీనిని ప‌గ‌టి పూట తీసుకోవ‌డం మంచిది. ఈ ఆహారాల‌న్నీ కూడా నిద్ర‌కు ఆటంకాన్ని క‌లిగిస్తాయి. క‌నుక రాత్రి నిద్రించే ముందు తేలిక‌గా, సుల‌భంగా జీర్ణ‌మయ్యే ఆహారాల‌ను ఎంచుకోవాలి. అలాగే ప‌డుకునే ముందు రెండు లేదా మూడు గంట‌ల ముందుగానే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా జీర్ణ క్రియ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+