రాత్రి పూట ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..! వేటిని తింటే మంచిది..?
ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యత ఆహారం చాలా అవసరం. మారుతున్న జీవన శైలిలో ఆహార అలవాట్లలోనూ మార్పులు వచ్చాయి. సమయానికి తీసుకోవాల్సినది తీసుకోని కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా రాత్రి సమయంలో తీసుకోవాల్సిన ఆహారం లో చాలా జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన వారు మరింతగా రాత్రి పూట ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీంతో.. అసలు రాత్రి సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి... వేటికి దూరంగా ఉండాలనే సందేహాలపైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
కొందరు రాత్రి పూట తినకూడని ఆహారాలను కూడా తింటుంటారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కొన్ని ఆహారాలను రాత్రి పూట ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోకూడదు. రాత్రి పూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలనే తినాల్సి ఉంటుంది. ఇక పిండి పదార్థాలు ఉండే ఆహారాలను వీలైనంత వరకు మధ్యాహ్నం పూటే ఎక్కువగా తినాలి. పిండి పదార్థాలు ఉండే ఆహారాలను రాత్రి పూట అధికంగా తింటే పొట్టలో అసౌకర్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రోటీన్లు ఉండే ఆహారాలను కూడా రాత్రి పూట తక్కువగా తినాలి. చాలా మంది రాత్రి పూట మాంసం అధిక మొత్తంలో తింటారు. ఇది శరీరానికి చేటు చేస్తుంది. మాంసాన్ని కేవలం ఉదయం ..మధ్యాహ్నం మాత్రమే అధికంగా తినాలి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం ఏర్పడుతాయి.
కొవ్వు పదార్థాలను కూడా రాత్రి పూట తినకూడదు. ఆ సమయంలో వీటిని శరీరం జీర్ణం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇక.. రాత్రి పూట ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు, విత్తనాలు వంటి ఆహారాలను తినవచ్చు. చిరు ధాన్యాలతో చేసిన ఆహారాలు అయితే మంచిది. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికలు, సామలు, ఊదలు, కొర్రలు వంటి చిరు ధాన్యాలను రాత్రి పూట తింటే మేలు జరుగుతుంది. రాత్రి పూట కొవ్వు తీసిన గోరు వెచ్చని పాలలో కాస్త తేనె కలిపి తాగితే మంచిది.
అలాగే అల్లం రసం లేదా యాలకుల పొడిని అయినా కలిపి తాగవచ్చు. రాత్రి పూట ఆహారంలో దాల్చిన చెక్క పొడి, సోంపు గింజల పొడి, మెంతుల పొడి, యాలకుల పొడిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. రాత్రి పూట భోజనాన్ని 7.30 లేదా 8 గంటల లోపు ముగిస్తే మంచిది. దీంతో తిండికి, నిద్రకు మధ్య విరామం ఉంటుంది. నిద్ర చక్కగా పడుతుందని ఆయుర్వేద వైద్యులు సూచనలు చేస్తున్నారు.
-
"దొండకాయ పకోడీ" అంటే ఆ హీరోయిన్‌కి అంత ఇష్టమా.. ఎలా చేయాలంటే ?? -
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications