రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలి - ఇదీ లెక్క, లేదంటే..!!

మూత్ర విసర్జన రోజుకు ఎన్ని సార్లు చేయాలి. సాధారణంగా 24 గంటల్లో ఆరోగ్య వంతమైన వారు ఎన్ని సార్లు మూత్ర విసర్జన చేస్తారనేది వైద్యుల పరిశోధనలో తేలింది. పలు రకాల సమస్యలతో ఉన్న వారు.. వారు తీసుకునే ఆహారం..ద్రవాల ఆధారంగా మూత్ర విసర్జన జరుగుతుంది. షుగ‌ర్ ఉన్న‌వారు ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. ఇక కొంద‌రు నిర్దిష్ట‌మైన సంఖ్య క‌న్నా త‌క్కువ సార్లు త‌క్కువ ప‌రిమాణంలో మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. అయితే మూత్ర విస‌ర్జ‌న‌కు సంబంధించి కొన్ని అంశాల పైన మాత్రం అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతీ ఒక్కరూ ఏ సందర్భంలోనూ శరీరం డీహైడ్రేడ్ కాకుండా చూసుకోవటం అవసరం. ఇందు కోసం ప్రతీ రోజు తప్పని సరిగా 2 నుంచి 3 లీట‌ర్ల నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. అదే వేడి వాతావ‌ ర‌ణంలో ఉన్నా, శారీర‌క శ్ర‌మ లేదా వ్యాయామం చేసినా, శ‌రీరంలో వేడి అధికంగా ఉన్నా ఇంకా ఎక్కువ మోతాదులో నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. అయితే నీళ్ల‌ను త‌గిన మోతాదులో సేవిస్తేనే మ‌న శ‌రీరం జీవ‌క్రియ‌ల‌ను స‌రిగ్గా నిర్వ‌హిస్తుంది. దీని వ‌ల్ల వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్ లిపోతాయి. రోజుకు క‌నీసం 2 లీట‌ర్ల నీళ్ల‌ను తాగే ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు క‌నీసం 4 నుంచి 7 సార్లు మూత్ర విస‌ర్జన చేయాల్సి ఉంటుంద‌ని వైద్యులు సూచిస్తున్నారు. 4 సార్ల క‌న్నా త‌క్కువ‌గా మూత్ర విస‌ర్జ‌న చేస్తే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇక..ఆల్క‌హాల్‌, టీ, కాఫీ త‌దిత‌ర పానీయాల‌ను సేవించిన‌ప్పుడు, మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు, నీటిని అధికంగా తాగేవారు రోజుకు స‌హ‌జంగానే 7 సార్ల క‌న్నా ఎక్కువ‌గా మూత్ర విస‌ర్జ‌న చేస్తారు.

the-normal-number-of-times-to-urinate-per-day-is-between-6-7-in-a-24-hour-period

అయితే, ఆరోగ్యంగా ఉన్న వారు ఏడు సార్లు కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేసినా సమస్య కాదని చెబుతున్నారు. రోజుకు 11 సార్ల క‌న్నా అధికంగా మూత్ర విస‌ర్జ‌న చేస్తే మాత్రం అలాంటి స్థితిని అనారోగ్యంగా భావించాలి. డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఇక మూత్రాన్ని కొంద‌రు కొన్ని గంట‌ల త‌ర‌బ‌డి అలాగే ఆపేస్తారు. ఇలా అస‌లు చేయ‌కూడ‌దు. దీని వ‌ల్ల మూత్రాశ‌య సైజు పెరుగుతుంది. ఇది ఇన్‌ఫెక్ష‌న్ల‌ను, ప్రోస్టేట్ స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. ఇక ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి మూత్రం లేత ప‌సుపు రంగులో ఉంటుంది. నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోతే కొంద‌రికి మూత్రం ప‌సుపు రంగులో లేదా గోధుమ రంగులో వ‌స్తుంది. కొన్ని ర‌కాల ఆహారాల‌ను తిన్న‌ప్పుడు లేదా ద్ర‌వాల‌ను తాగిన‌ప్పుడు మూత్రం స‌హ‌జంగానే రంగు మారుతుంది లేదా వాస‌న వస్తుంది. ఇలాంటి స్థితిలో డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సాధార ‌ణంగా ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తి మూత్ర విసర్జ‌న వ్య‌వధి దాదాపు 7 సెకండ్ల వ‌ర‌కు ఉంటుంది. మూత్ర విసర్జనలో సమస్యలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించటం అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+