శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే, మీకు ఈ లోపం ఉన్నట్లే - అలర్ట్ అవ్వండి..!!
శరీరంలో జరిగే అనేక చర్యలకు విటమిన్లు అవసరం. విటమిన్ బీ-కాంప్లెక్స్‌లోని ఒక కీలక విటమిన్ బీ-12. శరీరంలోని ప్రతీ కణానికి విటమిన్ బీ-12 అవసరం. ఆహారాన్ని శక్తిగా మార్చడం, కొత్త అణువులను తయారు చేయడం, కణాల్లో జరిగే రసాయన చర్యల్లో విటమిన్ బీ-12 కీలక పాత్ర పోషిస్తుంది. శరీరమంతా ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి బీ-12 అవసరం. ఈ విటమిన్ లోపాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది.
శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే కొన్ని సంకేతాలు స్పష్టంగా తెలుస్తాయి. వీటిని ముందుగానే గుర్తించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. విటమిన్ బి12 లోపించడం వల్ల గాయాలు త్వరగా నయం అవ్వవు. ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో శరీరానికి ఆక్సిజన్, రక్తం సరఫరా తగ్గుతాయి. దీంతో గాయాలు నయం అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. విటమిన్ బి 12 లోపించడం వల్ల పాదాల్లో జలదరింపు ఎక్కువగా ఉంటుంది. పాదాల్లో తిమ్మిర్లు, నరాలు దెబ్బతినడం, నడవడం కష్టంగా మారడం వంటి లక్షణాలు విటమిన్ బి12 లోపంలో ప్రధాన లక్షాలు. వీటితో పాటుగా అలసిపోయినట్టుగా, శరీరం బలహీనంగా ఉన్నట్టు ఉంటుంది. నోరు నొప్పిగా ఉండడం, చర్మం సున్నితంగా మారడం, నాడీ సంబంధిత సమస్యలు తలెత్తడం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. విటమిన్ బి12 లోపించడం వల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే
ఈ విటమన్ లోపిస్తే ఆందోళనగా, గందరగోళంగా ఉంటుంది. చికాకు, డిప్రెషన్ వంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మనం ప్రవర్తించే తీరు కూడా మారుతుంది. దీంతో, బీ12 తగ్గిందని గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ సమస్యతో బాధపడే వారికి ముందుగా సప్లిమెంట్స్ ను వైద్యులు సూచిస్తారు. సమస్య తీవ్రతను బట్టి వారానికి ఒక విటమిన్ బి12 ఇంజెక్షన్ ను కూడా సిఫార్సు చేస్తారు. ఇక వీటితో పాటు విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. విటమిన్ బి12 ఎక్కువగా మాంసాహారంలో ఉంటుంది. గుడ్లు, చేపలు, మాంసం, లివర్, పీతలు, పుట్టగొడుగులు, పాలు, పాల పదార్థాలు, టోఫు వంటి ఆహారాల్లో విటమిన్ బి12 ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
-
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications