దాల్చిన చెక్క పాలతో ఇన్ని లాభాలా - దెబ్బకు షుగర్ లెవల్స్ నియంత్రణలో..!!
దాల్చిన చెక్క. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. దాల్చిన చెక్క ఘాటుగా ఉంటుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దాల్చిన చెక్కను తీసుకుంటే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కానీ ఘాటుగా ఉంటుంది కాబట్టి దీన్ని నేరుగా తినలేరు. అయితే రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కాస్త దాల్చిన చెక్క పొడిని కలిపి తాగవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. షుగరు లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి.
దాల్చిన చెక్క పాలను తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాల్చిన చెక్క పాలను తాగుతుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దాల్చిన చెక్క వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సమస్య ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క పాలను సేవిస్తే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. పాలలో, దాల్చిన చెక్కలో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దీంతో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే ఇన్‌ఫెక్షన్లు సైతం తగ్గుతాయి.
దాల్చిన చెక్క పొడి కలిపిన పాలను తాగుతుంటే శరీరానికి క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. రాత్రి పూట దాల్చిన చెక్క పాలను సేవిస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అలాగే దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు ఈ పాలను రోజూ సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.
అయితే కొవ్వు తీసిన పాలను తాగాల్సి ఉంటుంది. దాల్చిన చెక్క పాలలో సినమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కనుక శరీరం లోపల, బయట ఉండే వాపులు తగ్గిపోతాయి. అయితే గర్భిణీలు, అలర్జీలు ఉన్నవారు, రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు, లివర్ సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ పాలను తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications